Little Girls
-
Video: లిఫ్ట్‌లో ఇరుక్కున్న ముగ్గురు చిన్నారులు.. భయంతో కేకలు, ఏడుపు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో మరో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఓ సొసైటీ లిఫ్ట్‌లో ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయారు. 8 నుంచి 10 సంవత్సరాల వయసున్న ముగ్గురు బాలికలు దాదాపు 25 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. ఘజియాబాద్‌లోని క్రాసింగ్స్ రిపబ్లిక్ టౌన్షిప్లో గల అసోటెక్ ది నెస్ట్‌లో నవంబర్ 29న ఈ ఘటన చోటుచేసుకుందిఈ దృశ్యాలన్నీ లిఫ్ట్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ముగ్గురు చిన్నారులు లిఫ్ట్‌లో ఉండగా అది సడెన్‌గా ఆగిపోయింది. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేందుకు చిన్నారులు ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. ఎమర్జెన్సీ బటన్ నొక్కినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ముగ్గురిలో ఇద్దరు చిన్నారులు భయంతో ఏడవడం ప్రారంభించారు. మరో చిన్నారి వారికి దైర్యం చెప్పేందుకు ప్రయత్నించింది. లిఫ్ట్ డోర్‌ను బలంగా కొడుతూ.. సాయం కోసం గట్టిగా అరిచింది. అంతేగాక తన రెండు చేతులతో బలవంతంగా డోర్ తెరిచేందుకు ప్రయత్నించింది. అయినా అది ఓపెన్ కాపోవడంతో భయాందోళనకు గురైంది. ప్రాణ భయంతో ముగ్గురు పిల్లలు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ, ఏడ్చడం వీడియో స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు ఆ చిన్నారులు అందులోనే ఉండిపోయారు. అనంతరం ఎట్టకేలకు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చదవండి: నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు #Ghaziabad क्रासिंग रिपब्लिक के assotech Nest society में बीती शाम 3 मासूम बच्चियां लिफ्ट में 25 मिनट तक फंसी रही, बेहद मुश्किलात के बाद उन्हें बाहर निकाल लिया गया,AOA के अध्यक्ष और सचिव के खिलाफ FIR दर्ज हुई है।यूपी की सोसाइटी में लिफ्ट एक्ट की जरूरत है @ghaziabadpolice @UPGovt pic.twitter.com/D0IsBChls9 — Lokesh Rai 🇮🇳 (@lokeshRlive) December 1, 2022 ఈ ఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ లిఫ్ట్‌లో జనాలు తరుచూ చిక్కుకుంటున్నారని, దీనిపై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలిపారు. లిఫ్ట్ ఆగిపోయిన సమయంలో అందులో సీనియర్ సిటీజన్లు, చిన్నారులు ఉంటే వారి ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని వాపోయారు. చిన్న పిల్లలు లిఫ్ట్ వాడేందుకే భయపడుతున్నారని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అపార్ట్మెంట్ బిల్డర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సొసైటీలో ఉన్న లిఫ్ట్లల్లో తరచూ ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయని చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా అపార్ట్మెంట్ బిల్డర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులతో బెంచ్.. చరిత్రలో మూడోసారి.. -
నిదురపో.. హాయిగా..
విశాఖపట్నం: మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గిరిజన రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. చంటి బిడ్డలను తమతోపాటే తల్లులు తీసుకువెళ్లి.. ఓ వైపు పనులు చేస్తూనే వారిని సాకుతూ మాతృత్వపు మమకారం చాటుతున్నారు. పంట భూముల్లోనే వారిని లాలించి.. నిద్రపుచ్చే దృశ్యాలు మన్యం అంతటా కనిపిస్తున్నాయి. హుకుంపేట–అడ్డుమండ ప్రధాన రహదారి గడ్డిమర్రి సమీపంలో చోడినారు సేకరణలో తల్లిదండ్రులు బిజీగా ఉండగా.. దగ్గరలోనే చిన్నారులు చీర ఊయల, గొడుగు కింద నిద్రపోతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. (క్లిక్: మన్యం అందం.. ద్విగుణీకృతం) -
కరోనా పోరు: శభాష్ చిన్నారులు
ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు అక్కాచెల్లెళ్లు. కరోనా విజృంభణ నేపథ్యంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశానికి తమ వంతు సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. మిజోరం రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారుల పేర్లు మాన్‌పుయ్ రొకుమ్(10), లార్లూట్‌ఫెలీ రొకుమ్(5). కొలాసిప్ జిల్లా బిల్కావత్తిలిర్‌లోని దావర్ వెంగ్ ప్రాంతానికి చెందిన చిన్నారులిద్దరూ డిబ్బీల్లో తాము దాచుకున్న డబ్బులను కరోనా మహమ్మారిపై పోరాడుతున్న సంస్థకు విరాళం ఇచ్చేశారు. వీరు డిబ్బీలో దాచుకున్న డబ్బులను లెక్కిస్తే రూ. 609, రూ. 580 వచ్చాయి. చిన్న వయసులో పెద్ద మనసు దాటిన అక్కాచెల్లెళ్లపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశవ్యాప్తంగా ఇలాంటి ఎంతో మంది చిన్నారులు కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ముందుకు రావడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. (కరోనా: పెరుగుతున్న ‘తబ్లిగి’ కేసులు) -
బాలల చెంతకు అమృతం
♦ పోషకాహారలోపంఅధిగమించే ప్రయత్నం ♦ నేటి నుంచి జిల్లాలో బాలామృతం పంపిణీకి శ్రీకారం పేద కుటుంబాలకు చెందిన చిన్నారులు పోషకాహార లోపంతో సతమతమవుతున్నారు... దీంతో పలువురు వ్యాధుల బారిన పడుతున్నారు... ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది... పట్టణాల్లో మురికి వాడలతోపాటు గ్రామీణ ప్రాంత బాలబాలికల్లో శారీరక, మానసిక అభివృద్దికి అనుబంధ పోషకాహారంగా బాలమృతం పథకాన్ని ప్రవేశపెడుతున్నారు... నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నద్ధమవుతోంది. కడప కోటిరెడ్డిసర్కిల్ : ఉమ్మడి రాష్ట్రం విడిపోకముందే ఖనిజ లవణాలతో కూడిన బలమైన పోషకాహార పదార్థాల మిశ్రమాన్ని బాలామృతం పేరుతో పంపిణీ చేసేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఈ పథకం నిలిచిపోవడంతో పంపిణీ ఆగిపోయింది. మూడేళ్లుగా దీనికి ప్రత్యామ్నాయంగా పలు రకాలైన పోషకాహారాన్ని అదనంగా అందించారు. తొలుత కుర్కురేలు, శనగలు ఇచ్చారు. ఎక్కువగా వస్తున్న శారీరక లోపాలను అరికట్టేందుకు ఆహార పదార్థాలను కూడా అందించారు. ఒక్కొక్క చిన్నారికి మూడు కిలోల బియ్యం, 500 గ్రాముల కందిపప్పు, 450 గ్రాముల వంటనూనె ఇంటికి అందించేవారు. ఇప్పుడు దీని స్థానంలో ప్రవేశ పెడుతున్న బాలామృతంతో టీహెచ్‌ఆర్‌ను రద్దు చేయనున్నా రు. జిల్లాలో 3621 అంగన్వాడీ కేంద్రాల్లో 203 281 మంది బాలబాలికలకు లబ్ధి చేకూర్చేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నద్ధమవుతోంది. ఇది ఎంతో ప్రయోజనం ఏడు నెలల నుంచి మూడేళ్ల వయసున్న బాలబాలికలకు బాలామృతం ద్వారా లబ్ధి చేకూరనుంది. బాలామృతం పథకాన్ని తొమ్మిది రకాల పోషక పదార్థాలతో రూపొందించారు. క్యాల్షియం, ఐరన్, విటమిన్–ఎ, బీ1, బీ2, సి, పోలిక్ యాసిడ్, నియాసిన్ ఖనిజ లవణాలు ఉన్నాయి. వేయించిన శనగ పప్పు, గోధుమపిండి, రీఫైండ్ ఆయిల్, పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌తో కలిపి రుచికరంగా తయారు చేశారు. ఒక్కొక్కరికి 100 గ్రాముల చొప్పున అందిస్తారు. అయితే నెలలో 25 రోజులు మాత్రమే ఐసీడీఎస్ ద్వారా సరఫరా చేస్తారు. ఏడు నెలల నుంచి ఏడాది వరకు పాలలో కలిపి తాపించాలి. ఏడాది నుంచి మూడేళ్ల వరకు పాలు లేదా వేడి నీళ్లలో ముద్దగా చేసి తినిపించాలి. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల ఎదుగుదలకు ఇదెంతో కీలకంగా ఉపయోగ పడుతుందని ఐసీడీఎస్ సిబ్బంది పేర్కొంటున్నారు. -
‘బాల్యం’.. చిక్కి శల్యం
- పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహారలోపం - నెలకు సగటున ఈ సమస్య బారిన 12 వేల మంది చిన్నారులు - శిశు సంక్షేమ శాఖ తాజా అధ్యయనంలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: బాల్యం ప్రమాదంలో పడింది. రాష్ట్రంలో నెలకు సగటున 12 వేల మంది చిన్నారులు పౌష్టికాహారలోపంతో బాధ పడుతున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ తాజా పరిశీలనలో వెల్లడైంది. బిడ్డ జనన సమయంలో పౌష్టికత్వంలో లోపాలు, తదనంతర పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ఈ ప్రక్రియ శిశుమరణాలకు దారితీస్తోంది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సం క్షేమ శాఖ చిన్నారుల పౌష్టిక స్థితిపై ఇటీవల అధ్యయనం చేసింది. రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులు 19.48 లక్షల మంది ఉండగా, వీరిలో 15.05 లక్షల మంది సాధారణ బరు వు ఉన్నారు. 4.29 లక్షల మంది తక్కువ బరువుతో ఉన్నారు. 12,620 మంది పిల్లల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. గర్భిణీ సమయం నుంచే... మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి పౌష్టి కాహార స్వీకరణపై దృష్టి పెట్టాలి. కానీ గ్రా మీణ ప్రాంతంలో ఈ అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో పిల్లలపై ప్రభావం చూపుతోంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆరోగ్యలక్ష్మి, బాలామృతం లాంటి కార్యాక్రమాలు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి ఫలితాలు రావడం లేదు. ఆర్నెళ్లు దాటిన చిన్నారులకు తల్లిపాలతో పాటు అదనపు పోషణ ఇవ్వాలి. ఉగ్గు, ఫ్యారెక్స్ తదితర పోషకాహారాన్ని మితంగా ఇవ్వాలి. కానీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పదినెలల వరకు తల్లిపాలతోనే సరిపెడు తున్నారు. కొన్నిచోట్ల ఆర్నెళ్ల తర్వాత తల్లి పాలు ఆపేసి గేదెపాలు ఇస్తున్నట్లు పరిశీలనలో తెలిసింది. ఈ ప్రక్రియ పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. పౌష్టిక లోపాలున్న చిన్నారుల సంఖ్య రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఎక్కువగా ఉంది. సెప్టెంబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,620 మంది చిన్నారుల్లో తీవ్ర పౌష్టిక సమస్య ఉన్నట్లు గుర్తించారు. అందులో రంగారెడ్డి జిల్లాలో 2,978 మంది, మెదక్ జిల్లాలో 2,922 మంది చిన్నారులున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఈ సంఖ్య 578గా నమోదు కావడం గమనార్హం. -
'రక్త' కన్నీరు!
* థలసీమియా చిన్నారుల హాహాకారాలు * రక్త దాతల కోసం ఎదురు చూపులు * థలసీమియా సొసైటీలో 50 యూనిట్లకు పడిపోయిన రక్త నిల్వలు * ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి సాక్షి, హైదరాబాద్: థలసీమియా (రక్తహీనత)తో బాధపడుతున్న చిన్నారులు రక్తం కోసం హాహాకారాలు చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రక్తనిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వారం రోజులుగా థలసీమియా బాధితులు ప్రాణాలకోసం పోరాడుతున్నారు. వీరిలో మూడేళ్ల నుంచి పన్నెండేళ్ల వయసుగల చిన్నారులున్నారు. బాధితులకు పదిరోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉండగా 16 రోజులకు కూడా రక్తం దొరకడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలకూ థలసీమియా సికిల్‌సెల్ సొసైటీ హైదరాబాద్‌లోనే ఉంది. ఈ సొసైటీ పరిధిలో ఇప్పటివరకూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన థలసీమియా బాధితులు సుమారు 2,500 మంది వరకూ పేర్లు నమోదు చేసుకున్నారు. వీళ్లుగాక మరో 2,500 మంది వరకూ బాధితులు ఉన్నారని అంచనా. ఈ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పురాణాహవేలి ప్రాంతంలో ప్రత్యేక రక్తనిధి కేంద్రం నడుస్తోంది. దీనిద్వారా రక్తదాన శిబిరాలను నిర్వహించడం, సేకరించిన రక్తాన్ని శుద్ధిచేసి బాధితులకు ఎక్కించడం చేస్తుంటారు. కానీ రక్త దాతలు కరువవడంతో ఇక్కడ నిల్వలు తీవ్రంగా పడిపోయినట్టు సొసైటీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 300 యూనిట్లనుంచి 50కి పడిపోయిన నిల్వలు థలసీమియా సొసైటీ పరిధిలో నడుస్తున్న రక్తనిధి కేంద్రంలో ఎప్పుడూ 300 యూనిట్ల రక్తం స్టాకు ఉంటుంది. రోజూ 50 యూనిట్ల రక్తం వ్యయమవుతూ ఉంటుంది. అలాంటిది స్టాకు 50 యూనిట్లకు పడిపోవడం, దాతలు సకాలంలో స్పందించకపోవడంతో బాధితులు హాహాకారాలు చేస్తున్నారు. బాధితులకు సమయానికి రక్తం ఎక్కించకపోతే ఒకవిధంగా మృత్యువుతో పోరాడినట్టే ఉంటుంది. ఆరేళ్లలోపు చిన్నారులకు నెలకు ఒకసారి, తొమ్మిదేళ్లు దాటితే 20 రోజులకు రెండుసార్లు యూనిట్ రక్తం చొప్పున ఎక్కించాలి. థలసీమియా బాధితులకు సెలైన్వాష్ చేసిన రక్తాన్నే ఎక్కించాలి మిగతా రక్తనిధి కేంద్రాల్లోని రక్తం వీరికి ఎక్కించేందుకు వీలుండదు. ఇలాంటి రక్తం థలసీమియా సొసైటీ కేంద్రంలోనే లభిస్తుంది. పైగా 5 రోజులకు మించి నిల్వ ఉన్న రక్తం వీరికి పనికిరాదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులు చాలామంది ఇక్కడ రక్తం కొరత ఉండటంతో అక్కడే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. బాధితులకు రక్త దాతలు యువ విద్యార్థులే. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల నుంచే రక్తం సేకరిస్తారు. కానీ ప్రస్తుతం అడ్మిషన్లు, కౌన్సెలింగ్‌లు ఉండటంతో విద్యార్థులు రక్తమివ్వడానికి రావడం లేదు. దీంతో ఒక్కసారిగా థలసీమియా బాధితుల ఇబ్బందులు మొదలయ్యాయి. దాతను నేనే తెచ్చుకోవాల్సి వస్తోంది నాది నల్లగొండ జిల్లా మిర్యాల గూడ. నా కొడుకు వయసు 13 నెలలు. 25 రోజులకోమారు రక్తం ఎక్కించాలి. కానీ దొరకడం లేదు. నేనే దాతను వెతుక్కుని హైదరాబాద్‌కొచ్చి బిడ్డకు రక్తం ఇప్పిస్తున్నా. ఇది తలకు మించిన భారమవుతోంది. - నాగేశ్వరరావు, మిర్యాలగూడ -
హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్‌కు యత్నం
హైదరాబాద్: ఫలక్‌సుమా పోలీసు పరిధి వట్టిపల్లి వద్ద ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసేందుకు యత్నం చేసారు. చిన్నారులు నాజర్ (7) మీరాజ్ (9)ను బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన ఇద్దరు దుండగులు. భయంతో రెయిన్‌బజార్ వద్ద బైక్‌పై నుంచి ఇద్దరు చిన్నారులు దిగిపోయారు. వెంటనే స్థానికులు రెయిన్‌బజార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారులను ఇద్దరిని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. -
కష్టాల్లో ‘బంగారు తల్లి’
ఖమ్మం హవేలి: చిన్నారి బాలికల కోసం ఏర్పాటు చేసిన బంగారుతల్లి పథకం 2013 మే 1 నుంచి అమలవుతున్నప్పటికీ బాలారిష్టాలు తప్పడం లేదు. ఆడపిల్లలకు ఉన్నత విద్య అందించేందుకు ప్రోత్సాహకంగా ఈ పథకాన్ని రూపొం దించారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకంలో నిత్యం ఎదురుచూపులే మిగిలాయి. 90శాతం మందికి ఇప్పటికీ బాండ్లు అందలేదు. లబ్ధిదారుల ఖాతాలో తక్షణం జమ కావాల్సిన రూ.2500 మొదటి విడత నగదు కూడా 60 శాతం మందికి పైగా జమ కాలేదు. జిల్లా నుంచి అధికారులు అన్ని వివరాలను ఆన్లైన్ చేసి పంపినప్పటికీ ప్రక్రియ ఏమాత్రం ముందుకు కదలడం లేదు. ఈ పథకం కొనసాగింపు విషయమై శాసనసభ సమావేశాల్లోనూ సభ్యులు ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత రాలేదు. పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తారో.. కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తారో కూడా ఏమాత్రం స్పష్టత లేదు. సంబంధిత శాఖ మంత్రి నుంచి తగిన సమాధానం రాకపోవడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. జిలా ్లవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 14,157 మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 6,604 మందికి మాత్రమే మొదటి విడత ఇన్స్టాల్మెంట్ నగదు ఖాతాల్లో జమ అయింది. వీరిలో సింహభాగం మందికి ఇప్పటికీ బాండ్లు అందలేదు. 7,553 మంది లబ్ధిదారుల ఖాతాలో మొదటి విడత నగదు జమ కాలేదు. బాండ్లు రాలేదు. మరో 65 మంది దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించబడ్డాయి. జిల్లా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ద్వారా 27మండలాల్లో ఈ పథకం అమలు అవుతోంది. ఈ మండలాల నుంచి 17 నెలల కాలంలో మొత్తం 9,214 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా 54 తిరస్కరణకు గురయ్యాయి. 4,409 మందికి మొదటి విడత నగదు జమ అయింది. మరో 4,805 మందికి ఇప్పటికీ మొదటి విడత నగదు ఖాతాలో పడలేదు. కాగా ఈ ఆర్థిక సవంత్సరం 2014-15కు సంబంధించి 3,656 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా అధికారులు 3,642మంది లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేశారు. నెలలు గడుస్తున్నప్పటికీ ఇందులో ఒక్కరికి కూడా తొలివిడత నగదు జమ కాలేదు. అదేవిధంగా మరో 19మండలాల్లో ట్రైబల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ద్వారా ఈ పథకం అమలు అవుతోంది. ఈ 19మండలాల నుంచి గత 17 నెలల కాలంలో మొత్తం 5,050 మంది దరఖాస్తు చేసుకోగా 11 తిరస్కరణకు గురయ్యాయి. 1,874మందికి మొదటి విడత నగదు ఖాతాల్లో జమ అయింది. 3,176 మంది లబ్ధిదారులకు ఇప్పటికీ నగదు ఖాతాలో జమ కాలేదు. 2014-15 సంవత్సరానికి సంబంధించి 2,069 దరఖాస్తులు రాగా అధికారులు 2,066 లబ్ధిదారుల వివరాలు అన్లైన్ ద్వారా అప్లోడ్ చేశారు. ఇందులో ఇక్కరికి కూడా తొలివిడత నగదు ఖాతాల్లో పడలేదు. లబ్ధిదారులు తమ దరఖాస్తు ప్రక్రియ వివరాలు తెలియక గగ్గోలు పెడుతున్నారు. నెలల తరబడి బాండ్లు రాకపోగా కనీసం మొదటి విడత నగదు కూడా ఖాతాల్లో చేరకపోవడంతో లబ్ధిదారులు మండలాల్లోని ఐకేపీ, ఖమ్మంలోని డీఆర్డీఏ, భద్రాచలంలోని ఐటీడీఏ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే ఖాతాల్లో నగదు జమ చేయడంతో పాటు బాండ్లు విడుదల చేస్తే ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. పథకం కొనసాగిస్తారో, లేదోనని అబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు అనేక సందేహాలతో సతమతం అవుతున్నారు. చివరకు బడ్జెట్లో సైతం ఇందుకు సంబంధించి సరైన ప్రస్తావన లేదు. బంగారుతల్లి పథకం కొనసాగింపు, మార్పులు, చేర్పుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం తగిన స్పష్టత ఇవ్వాలని, భరోసా కల్పించాలని లబ్ధిదారులతో పాటు ప్రజలు కోరుతున్నారు.