ఖర్చుకైనా... పొదుపుకైనా ‘చమురు’ వదిలిస్తారు..! | Unspent ... podupukaina 'oil' gives up ..! | Sakshi
Sakshi News home page

ఖర్చుకైనా... పొదుపుకైనా ‘చమురు’ వదిలిస్తారు..!

Published Fri, Feb 21 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM

ఖర్చుకైనా... పొదుపుకైనా ‘చమురు’ వదిలిస్తారు..!

ఖర్చుకైనా... పొదుపుకైనా ‘చమురు’ వదిలిస్తారు..!

రాజిరెడ్డిది ప్రైవేటు ఉద్యోగం. చిన్న వయసులోనే బాధ్యతలు మీద పడ్డాయి. చదువు కూడా ఒకదశలో ఆగిపోయింది. అయితేనేం! ఉద్యోగం చేస్తూ... ఉన్నత చదువులు కూడా చదివాడు. అదే సమయంలో పక్కా ప్లానింగ్‌తో చక్కటి ఇండిపెండెంట్ ఇల్లు కూడా సొంతం చేసుకున్నాడు. చిన్న వయిసులోనే ఓ ఇంటివాడయ్యాడు. ఆ యువకుడి కథే ఈ వారం ఫైనాన్షియల్ టార్గెట్.
 
చూడ్డానికి ఎడారి. నిండా చమురు నిక్షేపాలు. వాటితో కాసుల సేద్యం చేసే అబుదాబి, దుబాయ్, షార్జా వంటి ఏడు ఎమిరేట్స్ సమాఖ్యే యూఏఈ.  బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రం వచ్చాక 1970లలో ఈ సమాఖ్య ఏర్పడింది. చమురు నిల్వలతో పుష్కలంగా ఆదాయం వస్తుండటంతో ఇక్కడి ప్రభుత్వాలు తమ పౌరులకు ఇళ్ల నుంచి విద్య దాకా ప్రతి దానికీ పభుత్వం సబ్సిడీలు ఇస్తున్నాయి. స్వదేశీయుల కన్నా విదేశాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చిన వారి జనాభాయే ఇక్కడ అధికం. అయితే, ఆదాయ పన్ను మాత్రం లేదిక్కడ.
 
ఖర్చు: చాలామంది ఎమిరేటీలు (ఎమిరేట్స్ పౌరులు) ప్రభుత్వ ఉద్యోగాలే చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు చాలా తక్కువ. తమ పౌరుల పదవీ విరమణ అవసరాలపై ప్రభుత్వం బాగా శ్రద్ధ చూపిస్తోంది. పౌరులకు కావాల్సిన ఇతరత్రా అవసరాలనూ పట్టించుకుంటోంది. ఉదాహరణకు.. తక్కువ ఆదాయం వచ్చే ఎమిరేటీల వివాహాల కోసం ప్రత్యేకంగా యూఏఈ మ్యారేజ్ ఫండ్ ఉంది. ఇది పౌరుల వివాహాలకు  19,000 డాలర్ల దాకా గ్రాంటు కింద అందిస్తుంది. ఇల్లు మొదలుకుని కార్ల దాకా ప్రతీదీ సబ్సిడీ మీదే లభిస్తుంది. దీంతో వీరికి చేతినిండా డబ్బులుంటున్నాయి. దీన్ని విలాసాలకు ఖర్చు పెట్టేవారు కొందరైతే... మరీ కాస్మోపాలిటన్ జీవన విధానం కోరుకునే ఎమిరేటీలు... క్రెడిట్ కార్డుల్ని వినియోగిస్తూ, భారీగా వ్యక్తిగత రుణాలనూ తీసుకుంటున్నారు.
 
సంక్షేమం: సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఉదారంగానే ఉంటోంది. సాధారణంగా ఉద్యోగుల పెన్షన్ నిధికి కంపెనీలతో పాటు ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంటుంది. ఉదాహరణకు అబుదాబిలో పింఛను నిధికి ఉద్యోగులు తమ జీతంలో 5 శాతం ఇస్తే, వారు పని చేసే కంపెనీ మరో 15 శాతం, ప్రభుత్వం ఇంకో 6 శాతం నిధులను ఇస్తుంది. అంటే... నెలకు జీతంలో 26 శాతం పొదుపు చేస్తున్నట్లే. అందుకే ఎమిరేటీలకు రిటైర్మెంట్ తరవాత పెద్దగా ఇబ్బందులుండవు.
 
పెట్టుబడులు: ఎమిరేటీలు తమ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి వెల్లడించడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ.. షేర్లు, బాండ్లు, ఇతర దేశాల్లో రియల్ ఎస్టేట్ వంటి సాధనాల్లో బాగానే ఇన్వెస్ట్ చేస్తారు. పెపైచ్చు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు యూఏఈ ప్రత్యేకంగా సార్వభౌమ వెల్త్ ఫండ్ కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫండ్లలో ఇది కూడా ఒకటి. వివిధ దేశాల్లో వివిధ సాధనాల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement