ఆహారం కోసం పొదుపు
కంట్రీ కథ- కెనడా
బహుళ సంస్కృతుల మేళవింపు, ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతతో వంటి అంశాలతో కెనడాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సుమారు మూడున్నర కోట్ల జనాభా ఉండే కెనడియన్ల ఖర్చులు, ఇన్వెస్ట్‌మెంట్లు ఆసక్తికరంగా ఉంటాయి. ఒక సర్వే ప్రకారం ఆహార పదార్థాల వ్యయాలు భారీగా పెరిగిపోతుండటంతో కెనడియన్లు ఇతర ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నారు. ఇక, కెనడియన్ కుటుంబాలు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నాయి.
మొత్తం ఖర్చుల్లో సగటున
21 శాతం పన్నులకే పోతుంది.
ఇక ఆ తర్వాత వాటా రియల్టీపై వెచ్చిస్తారు. అద్దె ఇల్లయితే కిరాయి రూపంలో కావొచ్చు లేదా సొంత ఇల్లయితే ఈఎంఐల రూపంలోనైనా కావొచ్చు.
సాధ్యమైనంత వరకూ ఒక మోస్తరు ఆదాయం ఉన్న కెనడియన్లు కూడా సంపదను మరింత పెంచుకోవడంపైనే దృష్టి సారిస్తారు. ముందుగా సొంత ఇంటిని సాకారం చేసుకున్నాక.. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, రియల్టీ ఆస్తులు సమకూర్చుకుంటారు. కెనడాకి సంబంధించి దాదాపు 80 శాతం సంపద.. ఇరవై శాతం ప్రజల వద్ద ఉందని అంచనా.
ఈ సంపన్నులంతా కూడా ఎడా పెడా ఖర్చులు చేయడం కాకుండా.. పొదుపునకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తుంటారు.
ఆదాయం ఎంత ఉన్నా..
ఖర్చులు అంతకన్నా తక్కువే
ఉండేలా చూసుకుంటారు.