Country Story
-
ఆహారం కోసం పొదుపు
కంట్రీ కథ- కెనడా బహుళ సంస్కృతుల మేళవింపు, ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతతో వంటి అంశాలతో కెనడాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సుమారు మూడున్నర కోట్ల జనాభా ఉండే కెనడియన్ల ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్లు ఆసక్తికరంగా ఉంటాయి. ఒక సర్వే ప్రకారం ఆహార పదార్థాల వ్యయాలు భారీగా పెరిగిపోతుండటంతో కెనడియన్లు ఇతర ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నారు. ఇక, కెనడియన్ కుటుంబాలు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నాయి. మొత్తం ఖర్చుల్లో సగటున 21 శాతం పన్నులకే పోతుంది. ఇక ఆ తర్వాత వాటా రియల్టీపై వెచ్చిస్తారు. అద్దె ఇల్లయితే కిరాయి రూపంలో కావొచ్చు లేదా సొంత ఇల్లయితే ఈఎంఐల రూపంలోనైనా కావొచ్చు. సాధ్యమైనంత వరకూ ఒక మోస్తరు ఆదాయం ఉన్న కెనడియన్లు కూడా సంపదను మరింత పెంచుకోవడంపైనే దృష్టి సారిస్తారు. ముందుగా సొంత ఇంటిని సాకారం చేసుకున్నాక.. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, రియల్టీ ఆస్తులు సమకూర్చుకుంటారు. కెనడాకి సంబంధించి దాదాపు 80 శాతం సంపద.. ఇరవై శాతం ప్రజల వద్ద ఉందని అంచనా. ఈ సంపన్నులంతా కూడా ఎడా పెడా ఖర్చులు చేయడం కాకుండా.. పొదుపునకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తుంటారు. ఆదాయం ఎంత ఉన్నా.. ఖర్చులు అంతకన్నా తక్కువే ఉండేలా చూసుకుంటారు. -
పొదుపు.. ఓన్లీ పొదుపు
కంట్రీ కథ - చైనా ఇప్పుడిప్పుడు కొంత పరిస్థితి మారుతున్నా.. చైనాలో సాధారణంగా పొదుపునకు పెద్ద పీట వేస్తారు. వైద్య చికిత్స ఖర్చులు, విద్య వ్యయాలు అడ్డగోలుగా పెరిగిపోతుండటంతో భవిష్యత్‌లో ఖర్చుల కోసం ముందునుంచే చైనీయులు జాగ్రత్తపడతారు. మిగతా దేశాలన్నింటితో పోలిస్తే.. చేతిలో ఉండే డబ్బులో ఏకంగా 50 శాతం దాకా పొదుపు చేసేస్తున్నారట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. చైనాలో ఒకరే సంతానం సిద్ధాంతం ఉండటం, అత్యధికులు మగ సంతానానికే ప్రాధాన్యం ఇస్తుండటం వల్ల ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. ఉన్న అమ్మాయిలు బాగా స్థితిమంతులైన అబ్బాయిలనే ఎంచుకుంటూ ఉండటంతో మిగతా వారు సోలోగానే ఉండిపోవాల్సి వస్తోంది. అందుకే, ఖర్చులు తగ్గించుకునైనా డబ్బు కూడబెట్టుకుంటే మ్యారేజ్ మార్కెట్లో నెగ్గేయొచ్చన్నది కూడా చైనీయుల పొదుపు మంత్రం వెనుక కారణం కావొచ్చని పరిశీలకుల అభిప్రాయం. రియల్టీ ఖరీదైనప్పటికీ సొంత ఇంటిపై చైనీయులు ఇన్వెస్ట్ చేస్తుంటారు. సాధారణంగా ఇల్లు కొనుక్కోవాలంటే పాతిక శాతం నుంచి 30 శాతం దాకా డౌన్‌పేమెంట్ చేయాల్సి వస్తుంటుంది. రియల్ ఎస్టేట్ చాలా ఖరీదైన వ్యవహారం కావడంతో సగటు చైనీయులకు ఇది చాలా పెద్ద మొత్తం. ఇందుకోసం కూడా వారు బాగా పొదుపు చేయాల్సి వస్తోంది. కాస్త స్థితిమంతులు.. పెళ్లి కానుకలుగా తమ సంతానానికి ఇళ్లను బహూకరిస్తుంటారు. ఇక, తమ దేశంలో కన్నా విదేశీ చదువు బాగుంటుంది, అక్కడికెళ్లి వస్తే ఉద్యోగావకాశాలు కూడా బాగా వస్తాయనే ఉద్దేశంతో విదేశీ విద్య కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఇవి కాకుండా ఖరీదెక్కువైనా దిగుమతి చేసుకున్న కార్లనే కొనుక్కోవడానికి ఇష్టపడుతుంటారు చైనీస్. పాత తరంతో పోలిస్తే కొత్త తరం యువత ధోరణి మారుతోంది. ఇతర లగ్జరీ వస్తువుల కొనుగోళ్లవైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా పొదుపు రేటును తగ్గించి వినియోగాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. -
ఏదైనా కొనేస్తాం..
అమెరికాకు దీటుగా గతకాలపు ప్రాభవాన్ని మళ్లీ సాధించే దిశగా అడుగులు వేస్తున్న రష్యాలో ప్రజల ఆర్థిక అలవాట్ల గురించి ఈ వారం కంట్రీ కథలో.. గతంలో ఏదైనా కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు రష్యన్లు. అత్యంత జాగ్రత్తగా ఖర్చుపెట్టేవారు. కానీ ప్రస్తుతం ట్రెండు మారి.. వెస్ట్రన్ ధోరణి పెరుగుతోంది. ఖర్చు చేసే విషయంలో చాలా స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. దాచి పెట్టడం కన్నా ఖర్చు పెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా ఫ్రిజ్‌లు, గృహోపకరణాలు, ఆహార పదార్థాలు, దుస్తులు వంటి వాటిపై ఎక్కువగా రష్యన్లు ఖర్చు పెడుతున్నారు. అలాగే, హాలిడే టూర్లు, పార్టీలపైనా బాగానే వెచ్చిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే సగటు రష్యన్లు గృహోపకరణాలపై రెండు రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తారట. వాషింగ్ మెషిన్లు, మొబైల్ ఫోన్లు వంటి వాటి కొనుగోళ్ల విషయంలో.. యూరప్‌లో మిగతా దేశాల వారిని అధిగమించేశారు రష్యన్లు. బీరు వినియోగంలో జర్మన్లతో పోటీపడుతున్నారు. ఇక ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొచ్చినప్పుడు.. డబ్బుపరంగా దాచుకోవాలంటే అది తమ కళ్లముందు కనిపించే సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు రష్యన్లు. బ్యాంకులు, వర్చువల్ ఇన్వెస్ట్మెంట్లు మొదలైన వాటి జోలికి ఎక్కువగా పోరు. అధికాదాయ వర్గాలకు చెందిన వారు రియల్ ఎస్టేట్‌పై ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇవి గాకుండా కార్లు కూడా బాగానే కొంటారు. జర్మనీలో తయారైన వాటికి కాస్త ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. రష్యాలో కేవలం అయిదు శాతం జనాభా మాత్రమే స్టాక్స్, మ్యుచువల్ ఫండ్స్ వాటి వాటిల్లో నేరుగా పెట్టుబడి పెడుతుంటారు. కేవలం రెండు శాతం జనాభాకు మాత్రమే బీమా కవరేజి ఉంది. క్రెడిట్ కార్డుల వినియోగంలో మాత్రం రష్యన్లు బాగా చురుగ్గానే ఉన్నారు. -
ఖర్చుకైనా... పొదుపుకైనా ‘చమురు’ వదిలిస్తారు..!
రాజిరెడ్డిది ప్రైవేటు ఉద్యోగం. చిన్న వయసులోనే బాధ్యతలు మీద పడ్డాయి. చదువు కూడా ఒకదశలో ఆగిపోయింది. అయితేనేం! ఉద్యోగం చేస్తూ... ఉన్నత చదువులు కూడా చదివాడు. అదే సమయంలో పక్కా ప్లానింగ్‌తో చక్కటి ఇండిపెండెంట్ ఇల్లు కూడా సొంతం చేసుకున్నాడు. చిన్న వయిసులోనే ఓ ఇంటివాడయ్యాడు. ఆ యువకుడి కథే ఈ వారం ఫైనాన్షియల్ టార్గెట్. చూడ్డానికి ఎడారి. నిండా చమురు నిక్షేపాలు. వాటితో కాసుల సేద్యం చేసే అబుదాబి, దుబాయ్, షార్జా వంటి ఏడు ఎమిరేట్స్ సమాఖ్యే యూఏఈ. బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రం వచ్చాక 1970లలో ఈ సమాఖ్య ఏర్పడింది. చమురు నిల్వలతో పుష్కలంగా ఆదాయం వస్తుండటంతో ఇక్కడి ప్రభుత్వాలు తమ పౌరులకు ఇళ్ల నుంచి విద్య దాకా ప్రతి దానికీ పభుత్వం సబ్సిడీలు ఇస్తున్నాయి. స్వదేశీయుల కన్నా విదేశాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చిన వారి జనాభాయే ఇక్కడ అధికం. అయితే, ఆదాయ పన్ను మాత్రం లేదిక్కడ. ఖర్చు: చాలామంది ఎమిరేటీలు (ఎమిరేట్స్ పౌరులు) ప్రభుత్వ ఉద్యోగాలే చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు చాలా తక్కువ. తమ పౌరుల పదవీ విరమణ అవసరాలపై ప్రభుత్వం బాగా శ్రద్ధ చూపిస్తోంది. పౌరులకు కావాల్సిన ఇతరత్రా అవసరాలనూ పట్టించుకుంటోంది. ఉదాహరణకు.. తక్కువ ఆదాయం వచ్చే ఎమిరేటీల వివాహాల కోసం ప్రత్యేకంగా యూఏఈ మ్యారేజ్ ఫండ్ ఉంది. ఇది పౌరుల వివాహాలకు 19,000 డాలర్ల దాకా గ్రాంటు కింద అందిస్తుంది. ఇల్లు మొదలుకుని కార్ల దాకా ప్రతీదీ సబ్సిడీ మీదే లభిస్తుంది. దీంతో వీరికి చేతినిండా డబ్బులుంటున్నాయి. దీన్ని విలాసాలకు ఖర్చు పెట్టేవారు కొందరైతే... మరీ కాస్మోపాలిటన్ జీవన విధానం కోరుకునే ఎమిరేటీలు... క్రెడిట్ కార్డుల్ని వినియోగిస్తూ, భారీగా వ్యక్తిగత రుణాలనూ తీసుకుంటున్నారు. సంక్షేమం: సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఉదారంగానే ఉంటోంది. సాధారణంగా ఉద్యోగుల పెన్షన్ నిధికి కంపెనీలతో పాటు ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంటుంది. ఉదాహరణకు అబుదాబిలో పింఛను నిధికి ఉద్యోగులు తమ జీతంలో 5 శాతం ఇస్తే, వారు పని చేసే కంపెనీ మరో 15 శాతం, ప్రభుత్వం ఇంకో 6 శాతం నిధులను ఇస్తుంది. అంటే... నెలకు జీతంలో 26 శాతం పొదుపు చేస్తున్నట్లే. అందుకే ఎమిరేటీలకు రిటైర్మెంట్ తరవాత పెద్దగా ఇబ్బందులుండవు. పెట్టుబడులు: ఎమిరేటీలు తమ ఇన్వెస్ట్మెంట్స్ గురించి వెల్లడించడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ.. షేర్లు, బాండ్లు, ఇతర దేశాల్లో రియల్ ఎస్టేట్ వంటి సాధనాల్లో బాగానే ఇన్వెస్ట్ చేస్తారు. పెపైచ్చు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు యూఏఈ ప్రత్యేకంగా సార్వభౌమ వెల్త్ ఫండ్ కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫండ్లలో ఇది కూడా ఒకటి. వివిధ దేశాల్లో వివిధ సాధనాల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. -
ఈఫిల్ టవరు ఇక్కడే అంతెత్తు పన్నులూ ఇక్కడే
ఫ్రాన్స్ పేరెత్తగానే ఈఫిల్ టవర్ గుర్తొస్తుంది. ఫ్యాషన్ రాజధాని ప్యారిస్ కనిపిస్తుంది. ఓస్ అంతేనా!! అంటే.... ఈ టవర్ స్థాయిలోనే ఇక్కడ పన్నులూ ఎక్కువే. పొదుపు కూడా ఎక్కువే. అదే ఈ కంట్రీ స్పెషల్. ఏడాదికి ఒక మిలియన్ యూరోల ఆదాయం ఉన్నవారిపై ఏకంగా 75 శాతం మేర ఆదాయపు పన్ను వేయాలని ఫ్రాన్స్ కొత్త అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండ్ ప్రతిపాదించారు. ఈ దెబ్బకి గెరార్డ్ డెపార్డూ వంటి యాక్టర్ ఫ్రెంచ్ పౌరసత్వాన్ని కూడా వదులుకోవటానికి సిద్ధపడ్డారు. చివరకు ఫ్రాంకోయిస్ వెనక్కి తగ్గారనుకోండి. అది వేరే విషయం. అలాంటి హిస్టరీ ఫ్రాన్స్‌ది. ఫ్రాన్స్‌లో పన్నులు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఆదాయ పన్ను 45 శాతంగా ఉంది. దీంతో పాటు సోషల్ సర్వీస్ ట్యాక్స్ 12 శాతం ఎటూ చెల్లించాల్సిందే. చాలా ఉత్పత్తులపై 19 శాతం వేల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) కూడా ఉంటోంది. ఇంత భారీగా పన్నులు విధిస్తున్న ప్రభుత్వం... ఆ సొమ్మును పింఛను, వైద్యంతో పాటు సంక్షేమ పథకాలపై వెచ్చిస్తుండటం వల్ల జనానికి ఆ మేరకు ఊరట దొరుకుతోంది. పొదుపు చేసేదెలా...? యూరోజోన్ దేశాలన్నిట్లోనూ అత్యధికంగా పొదుపు చేసేది ఫ్రెంచి వారే. దీనికోసం వారు ఆశ్రయించేది బ్యాంక్ డిపాజిట్లనే. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో బ్యాంకు డిపాజిట్ల విలువ 85,700 కోట్ల డాలర్లపైనే. దీంతోపాటు వీరు పోస్టాఫీస్ పథకాల్లోనూ దాచిపెడుతుంటారు. వీటిపై వచ్చే వడ్డీకి పన్ను భారం లేకపోవటం అసలు కారణం. ఇక పొదుపు పథకాలపై వడ్డీ రేటు మనతో పోలిస్తే చాలా తక్కువ. కేవలం 1.75 శాతం. పిల్లల కోసం, ఇల్లు కొనుక్కోవాలనుకునే వారి కోసం ఇలా.. ఒక్కొక్క అవసరం కోసం ఒక్కో తరహా పొదుపు పథకాలున్నాయి. ఇన్వెస్ట్ చేయడం కన్నా వీటిలో పొదుపు చేయడంవైపే ఫ్రాన్స్ వాసులు మొగ్గు చూపుతుంటారు. అయితే, ఇటీవలి ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తోటి యూరోజోన్ దేశాల నుంచి ఒత్తిళ్లు వస్తే.. ఫ్రాన్స్ తమ సంక్షేమ పథకాల్లో కోత పెడుతుందని అంచనా. అదే జరిగితే.. తప్పనిసరిగా ఫ్రాన్స్ ప్రజలు బ్యాంక్ డిపాజిట్లే కాకుండా ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలవైపు మళ్లే అవకాశం ఉంది. మరి ఖర్చులో...? విలాస వస్తువులపై ఫ్రెంచివారు పెట్టే ఖర్చు ఎక్కువే. అయితే వీరి ఖర్చుల అలవాట్లను నిరుద్యోగం, తాత్కాలిక ఉద్యోగాలు ప్రభావం చేస్తుంటాయి. నిరుద్యోగం ఎక్కువగా ఉండి, తాత్కాలిక ఉద్యోగాలు తగ్గటం వంటివి జరిగితే వీరు వెంటనే ఖర్చులు తగ్గించేసుకుంటారు. ఒకవేళ ధరలు భారీగా పెరిగిపోతే... చాలా మంది ఖరీదైన వాటి జోలికెళ్లకుండా చౌకైన హైపర్ మార్కెట్లకు క్యూ కడతారు. ఆర్థికాంశాల్లో సహకారం కోసం 34 దేశాలు ఏర్పాటు చేసుకున్న ఓఈసీడీ కూటమిలో ఫ్రాన్స్ కూడా ఉంది. కాకపోతే ఈ దేశాలన్నిట్లోనూ అత్యధిక సమయం తింటూ, తాగుతూ గడిపేసేది ఫ్రెంచివారేనట.!!