పొదుపుపై పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి: అసోచామ్
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పొదుపులకు సంబంధించి పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచాలని పారిశ్రామిక మండలి అసోచామ్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. వేతన ఉద్యోగులకు స్టాండెర్డ్ డిడక్షన్‌ను పునఃప్రారంభించాలని కూడా ఒక ప్రకటనలో కోరింది. ఆయా అంశాలు వ్యవస్థలో వినియోగం, వృద్ధి దారితీస్తాయని వివరించింది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం నుంచి వివిధ ఆర్థిక, వ్యాపార, సామాజిక వర్గాలతో 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ముందస్తు చర్చలు జరపనున్న నేపథ్యంలో అసోచామ్ తాజా విజ్ఞప్తి చేసింది.