Tax exemption limit
-
Budget 2024: నో ట్యాక్స్ లిమిట్ రూ.8 లక్షలకు పెంపు..!?
రానున్న కేంద్ర బడ్జెట్ 2024పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ సంపూర్ణ బడ్జెట్‌కు ఉన్నంత అంచనాలు ఈ సారి బడ్జెట్‌పై ఉన్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు, దీర్ఘకాలిక పన్నుల విధానం, వినియోగం, పొదుపును పెంపొందించే చర్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. రూ.8 లక్షల వరకూ నో ట్యాక్స్! ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ పూర్తి బడ్జెట్లో ఉండే లాంటి ప్రయోజనాలు కొన్ని ఈ బడ్జెట్లో ఆశించవచ్చని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ జాతీయ అధ్యక్షుడు నారాయణ్ జైన్ తెలిపారు. సెక్షన్ 87A కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీని అందించవచ్చని, దీని కింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సింగిల్ హైబ్రిడ్ స్కీమ్ వ్యక్తిగత ఆదాయపు పన్ను విధింపునకు సంబంధించి కొన్ని మినహాయింపులను కలుపుకొని సరళీకృత "సింగిల్ హైబ్రిడ్ స్కీమ్"ని ఈ బడ్జెట్లో ప్రకటించవచ్చని బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్థిక వ్యవహారాలు, పన్నుల కమిటీ ఛైర్పర్సన్ వివేక్ జలాన్ అంచనా వేశారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు, పని చేసే తల్లులకు ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను ఈ బడ్జెట్లో ఆశించవచ్చని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (కలకత్తా చాప్టర్) చైర్పర్సన్ రాధికా దాల్మియా చెబుతున్నారు. రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన భత్యం పెంపు, బాలికలకు విద్య ప్రయోజనాలను పెంచడం కీలకమైనని ఆమె పేర్కొన్నారు. -
పన్ను మినహాయింపు.. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై ఆర్థిక శాఖ కీలక ప్రకటన
ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. బడ్జెట్లో ప్రకటించిన విధంగానే ప్రైవేట్ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత చేసుకునే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. ఇప్పటివరకు ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు రూ.3 లక్షలుగా ఉండేది. ఈ పరిమితిని 2002లో నిర్ణయించారు. ఇదీ చదవండి: సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్: ధర రూ.15 వేల లోపే సెక్షన్ 10(10AA)(ii) కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయించిన మొత్తం రూ.25 లక్షలకు మించరాదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పొడిగించిన పన్ను మినహాయింపు పరిమితి 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్) 2023 బడ్జెట్ లోని ప్రతిపాదనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచిందని, ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని సీబీడీటీ తెలిపింది. ఇదీ చదవండి: IT Returns: అందుబాటులోకి ఐటీఆర్-ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా! మరిన్ని బిజినెస్ వార్తలకోసం చదవండి సాక్షిబిజినెస్ -
పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి
న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్రం పన్ను మినహాయింపు పరిమితిని, గరిష్ట పన్ను శ్లాబులోకి వచ్చే ఆదాయ పరిమితిని పెంచాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే కొన్ని మినహాయింపులను కూడా 2023–24 బడ్జెట్లో అనుమతించాలని వారు సూచించారు. 2020–21 బడ్జెట్లో కేంద్రం .. సాంప్రదాయ ట్యాక్స్ శ్లాబ్‌లకు ప్రత్యామ్నాయంగా ఐచ్ఛిక ఆదాయ పన్ను విధానాన్ని కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో హెచ్ఆర్ఏ, గృహ రుణంపై వడ్డీలు, ఇతరత్రా కొన్ని పెట్టుబడులకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే పన్ను భారం తక్కువగా ఉండేలా ప్రతిపాదనలు చేసింది. దీని ప్రకారం రూ. 2.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. రూ. 15 లక్షలు దాటితే గరిష్టంగా 30 శాతం పన్ను ఉంటుంది. అయితే దీనివల్ల పన్ను భారం అధికంగా ఉంటోందని ఎవరూ ఈ ప్రత్యామ్నాయ విధానంపై ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే దీన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. వారి సూచనలు ఏమిటంటే .. ► నాంగియా అండర్సన్ ఇండియా చైర్మన్ రాకేశ్ నాంగియా: పెట్టుబడులు, సామాజిక భద్రత సంబంధ డిడక్షన్లను ప్రత్యామ్నాయ పన్ను విధానంలోనూ అందుబాటులో ఉంచాలి. అలాగే పన్ను రేట్లను మరింతగా క్రమబద్ధీకరించాలి. ► డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుధాకర్ సేతురామన్: జీవిత బీమా ప్రీమియంలు, గృహ రుణ రీపేమెంట్, గృహ రుణాలపై వడ్డీ చెల్లింపుల్లాంటి మినహాయింపులను అనుమతించాలి. సింగపూర్, హాంకాంగ్ తదితర దేశాల తరహాలో గరిష్ట ట్యాక్స్ రేటును 30 శాతంగా కాకుండా 25 శాతానికి తగ్గించాలి. ► ఈవై ట్యాక్స్ పార్ట్నర్ అమర్‌పాల్ ఎస్ చడ్ఢా: రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్, రూ. 2.5 లక్షల వరకు ఇతరత్రా మినహాయింపులను అనుమతించాలి. ప్రాథమిక ఎగ్జెంప్షన్ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలి. 30 శాతం ట్యాక్స్ రేటును రూ. 15 లక్షలు కాకుండా రూ. 20 లక్షలపైన ఆదాయానికి వర్తింపచేయాలి. ► ఏకేఎం గ్లోబల్ పార్ట్నర్ సందీప్ సెహ్గల్: 30 శాతం ట్యాక్స్ రేటును రూ. 20 లక్షల పైగా ఆదాయానికే వర్తింపచేయాలి. రూ. 5 లక్షల లోపు ఆదాయం గల వారికి రిబేటు ఇవ్వాలి. ఆలస్యంగా రిటర్ను వేసే వారికి కూడా ప్రత్యామ్నాయ పన్ను విధానం అందుబాటులో ఉంచాలి. -
ఆదాయ పన్ను మినహాయింపు: ఎస్బీఐ కీలక నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : 2018 ఆర్ధిక బడ్జెట్ మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ముందుకు రానున్న నేపథ్యంలో అంచనాలు భారీగా నెలకొంటున్నాయి. తాజాగా ఎస్బీఐ ఆకర్షణీయమైన నివేదికను సోమవారం వెల్లడించింది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 3లక్షల రూపాయలకు పెంచాల్సిన అవసరం ఉందని నివేదించింది. ముఖ్యంగా ఏడో వేతన కమిషన్ తర్వాత ఉద్యోగుల ఆదాయాలు పెరిగిపోయాయని, ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత 2.50 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచాలని ఎస్బిఐ తన తాజా నివేదికలో పేర్కొంది. తద్వారా దాదాపు 75 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని నివేదించింది. దీని మూలంగా ప్రభుత్వానికి కేవలం 7,500 కోట్ల మేర భారం పడుతుందని పేర్కొంది. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఎస్బిఐ ఇకోరాప్ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదాయపన్ను మినహాయింపు పెంపుతోపాటు, గృహ రుణంపై చెల్లించే వడ్డీకి సంబంధించిన మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న 2 లక్షల రూపాయల నుంచి 2.50 లక్షల రూపాయలకు పెంచాలని కోరింది. దీంతో హోంలోన్ గ్రహీతలు సుమారు 75 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని వెల్లడించింది. అంతేకాదు బ్యాంకుల్లో సేవింగ్స్ డిపాజిట్లు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. దీంతోపాటు సేవింగ్స్ టర్మ్ డిపాజిట్ల కాలపరిమితిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని సూచించింది. ఈ డిపాజిట్లను మినహాయింపు లభించే ఇఇఇ పన్ను విధానంలోకి తీసుకురాలని కోరింది. అంతేకాకుండా వ్యవసాయం, ఎంఎస్ఎంఇ, మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల్లో గృహ సదుపాయ కల్పనకు తగిన ప్రాధాన్యం కల్పించాలని సూచించింది. మౌలిక సదుపాయాలకు మద్దతు అందించడం, కార్మికుల నైపుణ్య శిక్షణ లాంటి ఇతర చర్యలు తీసుకోవాలనిఎస్బిఐ నివేదిక పేర్కొంది. -
గ్రాట్యుటీ పన్ను మినహాయింపు రూ. 20 లక్షలు!
న్యూఢిల్లీ: రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఇచ్చే గ్రాట్యుటీ చెల్లింపు సవరణ బిల్లు–2017ను వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంట్ ఆమోదించే అవకాశాలున్నాయి. దీని ప్రకారం.. 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఒక సంస్థలో పనిచేసి రిటైరయ్యే లేదా వైదొలిగే వారు పొందే గ్రాట్యుటీపై రూ.20లక్షల వరకు పన్ను ఉండదు. ప్రస్తుతం రూ.10 లక్షల వరకు గ్రాట్యుటీపై మాత్రమే పన్ను మినహాయింపు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పది అంతకంటే ఎక్కువ మంది పనిచేసే ఫ్యాక్టరీలు, గనులు, చమురు క్షేత్రాలు, ప్లాంటేషన్లు, నౌకాశ్రయాలు, రైల్వే కంపెనీలు, దుకాణాలు తదితర వ్యవస్థీకృత రంగ సంస్థలకు ఇది వర్తిస్తుంది. ఈ బిల్లు శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ ఆమోదం కూడా పొందింది. మహిళలకు మాతృత్వ సెలవులను పొడిగించే మెటర్నిటీ బెనిఫిట్ సవరణ బిల్లు–2017ను ఈ సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాల్లోనే వేతన కోడ్ బిల్లు బడ్జెట్ సమావేశాల్లో వేతన కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం కనీస వేతన పరిమితి అమల్లోకి వస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే తక్కువ వేతనం నిర్ణయించకూడదు. -
మధ్యతరగతి ప్రజలకు అతిపెద్ద ఊరట
న్యూఢిల్లీ : మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్లో అతిపెద్ద ఊరట కల్పించబోతుంది. వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితిని ఆర్థికమంత్రిత్వ శాఖ పెంచబోతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం మాత్రమే కాక, పన్ను శ్లాబులను సర్దుబాటు చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రూ.2,50,000గా ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని కనీసం రూ.3,00,000కు పెంచాలనే ప్రతిపాదనలు ఆర్థికమంత్రిత్వ శాఖ ముందుకొచ్చినట్టు పేర్కొన్నాయి. పన్ను మినహాయింపును పెంచడంతో పాటు, శ్లాబులను సర్దుబాటు చేయడం మధ్యతరగతి ప్రజలకు ముఖ్యంగా శాలరీ క్లాస్ వారికి ఎంతో మేలు చేకూరనుందని తెలుస్తోంది. గతేడాది బడ్జెట్లో పన్ను శ్లాబులను మార్చనప్పటికీ, చిన్న పన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరటనిస్తూ.. వార్షిక ఆదాయం రూ.2,50,000 నుంచి రూ.5,00,000 వరకు ఉన్నవారికి పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది. ఈ బడ్జెట్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రేటును 10 శాతం విధించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అదేవిధంగా రూ.10-20 లక్షలున్న వారికి 20 శాతం, రూ.20 లక్షలు పైన ఆదాయమున్న వారికి 30 శాతం పన్ను రేటును విధించాలని చూస్తోంది. ద్రవ్యోల్బణం పెరగడంతో జీవన వ్యయాలు భారీగా పెరిగాయని, దీంతో మినహాయంపుల బేసిక్ పరిమితిని, పన్ను శ్లాబులను సర్దుబాటు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
పొదుపుపై పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి: అసోచామ్
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పొదుపులకు సంబంధించి పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచాలని పారిశ్రామిక మండలి అసోచామ్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. వేతన ఉద్యోగులకు స్టాండెర్డ్ డిడక్షన్‌ను పునఃప్రారంభించాలని కూడా ఒక ప్రకటనలో కోరింది. ఆయా అంశాలు వ్యవస్థలో వినియోగం, వృద్ధి దారితీస్తాయని వివరించింది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం నుంచి వివిధ ఆర్థిక, వ్యాపార, సామాజిక వర్గాలతో 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ముందస్తు చర్చలు జరపనున్న నేపథ్యంలో అసోచామ్ తాజా విజ్ఞప్తి చేసింది.