ఆదాయంలో కొంతభాగం పొదుపు చేయాలి అనేది ఆర్థిక సూత్రం. అయితే ఈ విషయాన్ని అమెరికన్లు అస్సలు పాటించలేకపోతున్నారట. 63 శాతంమంది అమెరికన్లు తమ ఆదాయం.. నిత్యావసర ఖర్చులకే సరిపోవడం లేదంటున్నారట. వారు కనీసం అత్యవసర పరిస్థితుల్లో వాడుకొనేందుకు 5 వందల డాలర్లను కూడ వెనకేసుకోలేకపోతున్నారని తాజా సర్వేలు చెప్తున్నాయి.
సంపన్నదేశంగా చెప్పుకునే అమెరికాలో ఇప్పుడు 37శాతం మంది ప్రజలు మాత్రమే వారి ఆదాయంలో అత్యవసరాలకోసం ఐదు వందల డాలర్లనుంచీ వెయ్యి డాలర్ల వరకూ పొదుపు చేయగల్గుతున్నారని, మిగిలిన అరవై మూడు శాతం మంది క్రెడిట్ కార్డుల చెల్లింపులు, అప్పులు, అనుకోని ఖర్చులతో ఏమాత్రం వెనకేసుకోలేకపోతున్నారని సర్వే చెప్తోంది. అమెరికన్లు పొదుపర్లా, కాదా అన్నది ఇక్క్డడ విషయం కాకపోయినా... స్థానిక పేవ్ ఛారిటబుల్ లెక్కలు మాత్రం మూడు అమెరికన్ కుటుంబాల్లో ఒకరు కనీస పొదుపు కూడ చేయలేకపోతున్నారని చెప్తున్నాయి. అలాగే మాగ్నిఫై మనీ చేసిన సర్వేల్లో కూడ 56.3 శాతం మంది అమెరికన్ల సేవింగ్స్ ఖాతాల్లో కనీస మాత్రమైనా డబ్బు నిల్వ ఉండటం లేదని తేలింది. ఈ పరిస్థితి ప్రతి సంవత్సరం మరింత దిగజారిపోతున్నట్లుగా కనిపిస్తోందని సర్వేలు తెలుపుతున్నాయి.
నిజానికి మధ్య తరగతి కుటుంబాల్లో అత్యవసర ఖర్చులకు కనీసం పదివేల డాలర్లు అవసరమౌతాయని, కానీ అదికూడ వారు పొదుపు చేయలేకపోతున్నారని పేవ్ ఛారిటబుల్ ట్రస్ట్ అంటోంది. 25 వేల డాలర్లకన్నా తక్కువ ఆదాయం ఉన్నవారికి పొదుపు మరీ కష్టంగా ఉందని పేవ్ సర్వే ద్వారా తెలుస్తోంది. అయితే ఏభై నుంచి ఎనభై అయిదు వేల డాలర్లకు పైబడి ఆదాయం ఉన్నకుటుంబాల్లో మాత్రం 2,500 డాలర్లు వరకూ పొదుపు చేయగల్గుతున్నట్లు చెప్పారని, ఎనభై అయిదు వేలకన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారు మాత్రమే పదివేల డాలర్ల వరకూ పొదుపు చేయగల్గుతున్నట్లు చెప్పారని పేవ్ ఛారిటబుల్ అధ్యయనకారులు అంటున్నారు. ఏది ఏమైనా మధ్యతరగతి వారికి మాత్రం అత్యవసర పరిస్థితులు గడ్డుగానే మారుతున్నాయని లెక్కలు చెప్తుండగా... ఆయా కుటుంబాల్లో ఖర్చులు ప్రణాళికా బద్ధంగా లేకపోవడం వల్ల కూడ సంవత్సరమంతా ఇబ్బందులకు గురౌతున్నారని సర్వేలు తేల్చాయి. ముఖ్యంగా వీరి అనుకోని ఖర్చుల్లో కారు రిపేర్లు వంటివి ఉంటున్నాయని బ్యాంక్ రేట్ డాట్ కామ్ లెక్కల్లో తేలింది. 23 శాతం మంది ఇంటి ఖర్చులకు కాక, అదనంగా 500 నుంచి 1000 డాలర్ల వరకూ రెస్టారెంట్లలో భోజనాలకు, కాఫీలకు ఖర్చుపెడుతున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. వీరి బడ్జెట్లో మాత్రం స్థితి స్థాపకత కాస్త కనిపిస్తోందని సర్వే వెల్లడిస్తోంది.
అయితే అనుకోని పరిస్థితుల్లో వచ్చిన ఖర్చులకు క్రెడిట్ కార్డుల వంటివి వాడటం ఇతర వ్యాపరస్తులకు ప్రోత్సాహకరంగా, లాభదాయకంగా మారుతోందని సీనియర్ ఇన్వెస్టింగ్ అనలిస్ట్ షైనా స్టినేర్ చెప్తోంది. చాలామంది ఏ ఖర్చు వచ్చినా వెంటనే క్రెడిట్ కార్డును వాడేస్తుంటారని, అటువంటి ఏదో ఒక ఖర్చును తగ్గించుకోగల్గితే పొదుపు చేయడం అంత కష్టమైన పనేమీ కాదని ఆమె ప్రజలకు సూచిస్తోంది.
పొదుపులో అమెరికన్లు వెనుకబడ్డారట!
Published Sat, Jan 9 2016 8:40 PM | Last Updated on Thu, Apr 4 2019 3:48 PM
Advertisement