చదువుకున్న ప్రతి ఒక్కరూ జాబ్ చేయాలి, సంతోషంగా కాలం గడపాలి అనుకుంటారు. కానీ ఈ పోటీ ప్రపంచంలో చదువు పూర్తయిన ఉద్యోగంలో చేరిన తరువాత జీవితం మొత్తం ఉరుకులు, పరుగులతో నిండి ఉంటుంది. ఇది పక్కన పెడితే వచ్చే జీతాలు నెల మొత్తం గడపడానికి సరిపోవడం లేదు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సౌరవ్ దత్త అనే ఎక్స్ (ట్విటర్) యూజర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు రూ. 25 లక్షల వార్షిక వేతనం లభిస్తుందని. పొదుపు చేద్దామంటే డబ్బు మిగలడం లేదని వివరంగా పేర్కొన్నారు.
వార్షిక వేతనం రూ. 25 లక్షలు. నెలకు రూ.1.50 లక్ష చేతికి వస్తుంది. ఇందులో రూ.1 లక్ష ఈఎమ్ఐ, రెంట్ వంటి వాటికి.. రూ. 25వేలు ఫుడ్, మూవీస్, ట్రిప్స్ వంటి వాటికి, రూ. 25వేలు అత్యవసరానికి/మెడికల్ ఎమర్జెన్సీకి సరిపోతుంది. ఇలా మొత్తం ఖర్చు అవుతోంది. ముగ్గురున్న కుటుంబానికి ఇది సరిపోదు అంటూ.. పొదుపు చేయడానికి సాధ్యం కావడం లేదని వెల్లడించారు.
ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇందులో కొందరు రూ. 25లక్షలు సంవత్సరానికి సరిపోతాయని చెబుతున్నారు. మరికొందరు మారుతున్న జీవన విధానం వల్ల సరిపోదని అన్నారు. చాలామంది అతని లెక్క సరైంది కాదని విభేదిస్తున్నారు.
25LPA is too little for running a family.
25 LPA = in hand 1.5L per month.
Family of 3 would spend 1L on essentials, EMI / rent.
25K for eating out, movies, OTT, day trips.
25K for emergency and medical.
Nothing left to invest.— Sourav Dutta (@Dutta_Souravd) August 11, 2024
Comments
Please login to add a commentAdd a comment