డబ్బును డబ్బే సంపాదిస్తుంది. అందుకే మన జేబులో డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు రకరకాలుగా పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతుంటాం. పెట్టుబడులు పెట్టేందుకు ఇళ్లు, బాండ్స్, బంగారం, స్టాక్ మార్కెట్ వంటి పెట్టుబడి సాధానాలు ఉన్నాయి. అయితే ఈ పద్దతుల్లో డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టాలంటే మన వద్ద భారీ మొత్తంలో డబ్బులు ఉండాలి.
అలా కాకుండా రోజు వారి దిన సరి కూలీల్ని సైతం లక్షాది కారుల్ని చేసే పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. వాటిల్లో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మీరు ఎంచుకున్న పద్దతిలో పెట్టుబడి పెట్టుకోవచ్చు.
బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ తరహాలో
ఇది బ్యాంక్‌లో రికరింగ్ డిపాజిట్ మాదిరిగానే పనిచేస్తుంది. అంటే 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు ఎంపిక చేసుకుని అందులో నెలకు కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. దానిపై అసలు, ప్లస్ వడ్డీని టెన్యూర్ ముగిసే సమయానికి పొందవచ్చు.
నెలకు రూ.1000 చొప్పున
అలాంటిదే ఈ మ్యూచువల్ ఫండ్స్‌లోని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇందులో ఉదాహరణకు రాము అనే దినసరి కూలి నెలకు రూ.1000 చొప్పున 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టినట్లైతే ఏడాదికి 12 శాతం చొప్పున వడ్డీ వస్తుంది. ఫలితంగా అసలు పెట్టుబడి రూ.3.6 లక్షలైతే.. నిర్ణీత గడువు ముగిసే సమాయానికి వచ్చేది రూ.34.9లక్షలు.
రూ.1000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది
ఒకవేళ అదే రాము 20 సంవత్సరాలు పాటు నెలకు రూ.1000 పెట్టుబడిగా పెడితే ఆ మొత్తం రూ. 2,40,000 అవుతుంది. గడువు ముగిసే సమయానికి వచ్చే మొత్తం రూ. 9.89 లక్షలు. అదే 10ఏళ్ల పాటు నెలకు రూ. 1,000 చొప్పున పెట్టుబడి పెడితే మొత్తం రూ.1,20,000 అవుతుంది.
ఆ మొత్తం కాస్త గడువు ముగిసే సమయానికి రూ. 2,30,038 అవుతుంది. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం పిల్లల చదువుకోసం, పెళ్లిళ్ల కోసం ఇతర అవసరాల కోసం చిన్న మొత్తంలో పెట్టుబడిలు పెట్టి భారీ మొత్తంలో డబ్బుల్ని ఆదా చేయండి.
Comments
Please login to add a commentAdd a comment