ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎలా ప్రారంభించాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్...
చిన్న చిన్న నీటి బిందువులన్నీ కలిసి సముద్రంలా మారతాయి. అలాగే చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్లన్నీ కలిసి దీర్ఘకాలంలో కాం పౌండింగ్ ప్రక్రియ ద్వారా మనకు అధిక ప్రయోజనాన్ని అందిస్తాయి. ఎప్పడూ ఖర్చు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయవద్దు. కొంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్నే ఖర్చుపెట్టండి. అంటే మొత్తం ఆదాయంలో కొంత భాగాన్ని ముందుగానే సేవింగ్స్/ఇన్వెస్ట్‌మెంట్లకు కేటాయించుకోవాలి.
మనం ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నామనే విషయానికి ప్రాధాన్యమివ్వడం కన్నా... ఆ చేసే ఇన్వెస్ట్‌మెంట్లను ఎంత త్వరగా ప్రారంభించాం? వాటిని రెగ్యులర్‌గా సక్రమంగా క్రమశిక్షణతో చేస్తున్నామా? లేదా? అనే అంశాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. అలాగే ఇన్వెస్ట్‌మెంట్లను దీర్ఘకాలంలో కొనసాగిస్తే అధిక ప్రయోజనాలను పొందొచ్చు. ఎలాగంటే మంచి సేవింగ్స్/ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒక విత్తనం లాంటివి అనుకుంటే... విత్తనం నుంచి చెట్టు ఎలా పెరుగుతుందో... అలాగే మన చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలను పొందుతాం. ఇన్వెస్ట్‌మెంట్లను ఎంత వీలైతే అంత త్వరగా ప్రారంభించడానికి ప్రయత్నించండి.