ఇళ్లు కొనాలనుకుంటున్నారా.. కొనండి. కారు తీసుకోవాలనుకుంటున్నారా.. తీసుకోండి. విదేశాలు చుట్టేయాలనుకుంటున్నారా.. వెళ్లిరండి. పిల్లలను మంచి స్కూల్‌లో చేర్పించాలంటే.. చేర్పించండి.. అంతా బాగానే ఉంది కానీ, అన్నింటికీ డబ్బుకావాలని ఆలోచిస్తున్నారా. మరేం ఫర్వాలేదు. ఉద్యోగం చేస్తూనే అన్ని కోరికలు తీర్చుకోవచ్చు. ఎలా అంటారా? అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మదుపు ప్రారంభించాలి. ప్రధానంగా అందరికీ ‘ఫిష్’ గురించి తెలియాలి. అదేంటి చేప గురించి తెలిస్తే డబ్బు సంపాదించవచ్చని అనుకుంటున్నారేమో..కాదండి. ‘ఫిష్’ను పాటిస్తే దాదాపు మన కోరికలు నెరవేర్చుకోవచ్చు. అసలు ఈ ‘ఫిష్’ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
‘ఫిష్’ థియరీ
ఎఫ్‌ఐ.ఎస్.హెచ్: ఫిష్..ఆర్థిక ప్రణాళిలో ఈ ఫిష్ థియరీని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫిష్ థియరీను మూడు భాగాలుగా విభజించారు.
ఎఫ్‌ఐ: ఫిక్స్‌డ్ ఎక్స్‌పెన్సెస్
ఎస్: సేవింగ్స్
హెచ్: హ్యాపీ టు స్పెండ్
ఎఫ్‌ఐ: ఫిక్స్‌డ్ ఎక్స్‌పెన్సెస్
బ్యాంకు అకౌంట్‌లో జీతం పడగానే నెలవారీ స్థిర ఖర్చుల కోసం(ఎఫ్‌ఐ) డబ్బు వెచ్చించాలి. అందులో ప్రధానంగా ఇంటి అద్దె, ఇంటర్నెట్ బిల్లు, సరుకులు, ఫోన్ బిల్లు..వంటి ఖర్చులు సాధారణంగా ఉంటాయి. అయితే ఈ మధ్య కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి కదా. ఒకవేళ నెల మధ్యలో అమాంతం వాటి విలువ పెరిగినా ఓ పదిశాతం అధికంగా ఖర్చు చేసే వీలుంటుంది. అందుకు అనువుగా బడ్జెట్ కేటాయించుకోవాలి. అయితే ఫిక్స్‌డ్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ కలిపి జీతంలో యాభైశాతానికి మించకుండా జాగ్రత్త వహించాలి.
ఎస్: సేవింగ్స్
భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు(ఎస్) చేయాలి. వేతనంలో 50 శాతం ‘ఎఫ్‌ఐ’కు కేటాయించాక మిగిన దాని నుంచి 30 శాతం ఇంటి నిర్మాణం, రిటైర్‌మెంట్ ప్లాన్, హెల్త్‌పాలసీ, టర్మ్ పాలసీ, ఇన్వెస్ట్‌మెంట్ కోసం కేటాయించాలి. ఎలాంటి మార్గాల్లో మదుపు చేయాలనే అంశంపై నిపుణులతో చర్చించాలి.
ఇదీ చదవండి: మారుతున్న ప్రచార పంథా
హెచ్: హ్యాపీ టు స్పెండ్
ఇక మిగిలిన 20 శాతం జీతాన్ని ఆనందాలకు, అభిరుచులకు ఖర్చు పెట్టుకోవచ్చు. విందూ వినోదాలకు వెచ్చించవచ్చు. సినిమాలు, షికార్లు, షాపింగ్..వంటి వాటికి ఏంచక్కా ఖర్చు చేసుకోవచ్చు. కానీ పైన తెలిపిన విధంగా ఇతర వాటికి డబ్బు కేటాయించిన తర్వాతే మిగతా సొమ్మును ఖర్చు పెట్టాలి. ఒక్కసారి ఈ ‘ఫిష్’ థియరీను ఆకలింపు చేసుకుని ప్రయోగాత్మకంగా కొన్ని నెలలు పాటిస్తే ఆర్థిక జీవితంలో మార్పు గుర్తిస్తారని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment