
ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ల రేట్లలో మార్పులు
చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఏడాది కాల వ్యవధి టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇతర టర్మ్ డిపాజిట్లపై కాల వ్యవధిని బట్టి రేటును 25-50 బేసిస్ పాయింట్ల దాకా తగ్గించింది. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది.