ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ రేట్లు తగ్గింపు
చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ రేట్లను 25 - 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 11 నుంచి (నేటి నుంచి) అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం 181 రోజుల పైబడిన కాలవ్యవధికి సంబంధించి టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పావు నుంచి అరశాతం దాకా తగ్గించినట్లు బ్యాంక్ పేర్కొంది.