ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. ఆర్‌బీఐ రెండు సార్లు కీలక రేట్లను పెంచడం, ఐఎల్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం తర్వాత మార్కెట్లో నిధుల లభ్యత తగ్గడం వంటి పరిస్థితుల నేపథ్యంలో డిపాజిట్లను ఆకర్షించడానికి బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మార్కెట్లలో అధిక అస్థిరత నెలకొనడంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి కస్టమర్లలో తిరిగి ఆరంభమైందని ఐసీఐసీఐ రిటైల్ రుణాల విభాగం అధిపతి ప్రణవ్‌మిశ్రా చెప్పారు.
రెండేళ్లకు పైగా, మూడేళ్లలోపు కాల వ్యవధి కలిగిన రూ.కోటి లోపు డిపాజిట్లపై బ్యాంకు ఇక నుంచి 7.5 శాతం వడ్డీ రేటు ఇస్తుంది. 46–60 రోజులు, 61–90 రోజులు, 91–120 రోజులు, 121–184 రోజుల డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను పావుశాతం పెంచింది. ఏడాది నుంచి 389 రోజుల డిపాజిట్‌పై మాత్రం వడ్డీ రేటును 0.15 శాతం పెంచింది. అలాగే, 390 రోజుల నుంచి రెండేళ్ల వరకు కాల డిపాజిట్లపై వడ్డీ రేటును 0.10% పెంచింది. గురువారం నుంచి పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఐసీఐసీఐ డిపాజిట్ రేట్లు పావు శాతం పెంపు
Published Thu, Nov 15 2018 12:23 AM | Last Updated on Thu, Nov 15 2018 12:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment