అమితాబ్ కు మళ్లీ ‘ఐటీ’ చిక్కులు! | Supreme Court allows fresh assessment of Amitabh Bachchan's tax liability | Sakshi
Sakshi News home page

అమితాబ్ కు మళ్లీ ‘ఐటీ’ చిక్కులు!

Published Thu, May 12 2016 1:05 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

అమితాబ్ కు మళ్లీ ‘ఐటీ’ చిక్కులు! - Sakshi

అమితాబ్ కు మళ్లీ ‘ఐటీ’ చిక్కులు!

పాత అసెస్‌మెంట్‌ను తిరగదోడేందుకు
ఐటీ శాఖకు సుప్రీం అనుమతి

 న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను(ఐటీ) చెల్లింపు వివాదానికి సంబంధించి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు మళ్లీ చిక్కులు మొదలయ్యాయి. 2001-02 అసెస్‌మెంట్ ఏడాదికిగాను అమితాబ్ ఆదాయ వివరాల వెల్లడి విషయంలో తాము వేసిన కేసును మళ్లీ తిరగదోడేందుకు ఐటీ శాఖను సుప్రీం కోర్టు బుధవారం అనుమతించింది. జస్టిస్ రంజన్ గొగోయ్, పీసీ పంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. అమితాబ్ ఐటీ చెల్లింపునకు సంబంధించి మళ్లీ మదింపు(అసెస్‌మెంట్) చేయాలంటూ ముంబై ఐటీ కమిషర్ ఇచ్చిన ఆదేశాలను బెంచ్ సమర్థించింది.

ఐటీ శాఖ దాఖలు చేసిన రెండు ప్రత్యేక అభ్యర్ధనలకు అంగీకరించడంతోపాటు అంతక్రితం ఈ కేసులో బాంబే హైకోర్టు, ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) ఇచ్చిన తీర్పులను పక్కనబెడుతున్నట్లు కూడా ధర్మాసనం పేర్కొంది. 2001-02లో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ క్విజ్ ప్రోగామ్ నిర్వహణకు గాను అమితాబ్‌కు భారీమొత్తంలో పారితోషకం లభించిందని.. అయితే, ఆయన మాత్రం తమకు రూ.కోట్లలో పన్నును చెల్లించాల్సి ఉన్నప్పటికీ, చెల్లించకుండా తప్పించుకున్నారనేది ఐటీ శాఖ వాదన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement