షోలాపూర్: సుశీల్ కుమార్ షిండేను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో షోలాపూర్ స్థానం నుంచి మళ్లీ గెలిపించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పార్టీ కార్యకర్తలను కోరారు. షిండే కేంద్ర హోంశాఖ మంత్రితో పాటు లోక్‌సభ సభాధ్యక్షుడిగా ఉన్నందుకు షోలాపూర్ ప్రజలు గర్వపడాలని ఆయన శనివారం పండరీపూర్‌లో మీడియాకు తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు ప్రజాస్వామ్య కూటమి ఎన్నికల కమిషన్ అనుమతి అడగనుందని చెప్పారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వారి అనుమతి తప్పనిసరి అని వివరించారు. ఇదిలావుండగా పవార్ ప్రధానమంత్రి అయితే సంతోషపడతానని ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు.
షిండేని గెలిపించండి: పవార్
Published Sat, Mar 8 2014 10:54 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement