పాపం.. పసిగుడ్డు | Born with cancer | Sakshi
Sakshi News home page

పాపం.. పసిగుడ్డు

Published Sun, Apr 10 2016 6:34 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

పాపం.. పసిగుడ్డు

పాపం.. పసిగుడ్డు

♦ పుట్టుకతోనే క్యాన్సర్
♦ ఏడు నెలలుగా మృత్యువుతో పోరాటం
♦ ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రుల వేడుకోలు
 
 సుల్తానాబాద్: చూడముచ్చటగా ఉన్న ఈ చిన్నారికి క్యాన్సర్ వ్యాధిసోకి మృత్యువుకు చేరువలో ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం గడవడమే కష్టం కావడంతో పెద్ద రోగానికి చికిత్స చేరుుంచేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. దాతల కోసం ఎదురుచూస్తున్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటకు చెందిన ఏరుకొండ వేణు-ఉమాదేవి దంపతుల కుమార్తె విరోనిత. అమ్మారుు పుట్టినప్పటి నుంచి తరచూ అస్వస్థతకు గురవుతుండటంతో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులు తిరిగారు. పాప పట్టుకతోనే క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు.

కూలీ చేసుకొని బతికే వేణు దంపతులు ఇప్పటికే సుమారుగా రూ. మూడు లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. చికిత్సకు మరో  ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి పాప పరిస్థితి విషమించడంతో శనివారం మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం గాని, దాతలు గాని స్పందించి తమ బిడ్డను బతికించాలని వేడుకున్నారు. అనంతరం పాపను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక సహాయం చేయదల్చినవారు వేణును 9000448052, 9701671365 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. లేదా ఏరుకొండ వేణు, ఎస్‌బీఐ అకౌంట్ నంబరు 20168418439, ఐఎఫ్‌ఎస్‌ఐ కోడ్ 0012904లో డబ్బులు వేయూలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement