సుల్తానాబాద్ (కరీంనగర్) : ఓ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సరిగా అమలు కాకపోవడంతో నిర్వహకురాలిని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని అశోక్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో 45 మంది విద్యార్థులకు వండేందుకు హెచ్‌ఎం 4.5 కేజీల బియ్యాన్ని నిర్వహకురాలికి ఇచ్చారు.
అయితే ఆమె అందులో సగం బియ్యాన్ని వండి మిగతా వాటిని మాయం చేసింది. దీంతో విద్యార్థులు అర్ధాకలితోనే భోజనం ముగించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు విచారణ చేపట్టి నిర్వాహకురాలిని సస్పెండ్ చేశారు. సాంబారు, కొడుగుడ్డు కూడా భోజనంలో వడ్డించడం లేదని విద్యార్థులు ఈ సందర్భంగా అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు సస్పెండ్
Published Mon, Aug 24 2015 6:55 PM | Last Updated on Wed, Aug 29 2018 7:54 PM
Advertisement