రాఖీ కట్టి స్వగ్రామానికి వెళుతుండగా శనివారం సుల్తానాబాద్ బస్టాండ్‌లో వివాహిత మహిళ మెడలో నుంచి పుస్తెల తాడును గుర్తుతెలియని యువకులు అపహరించారు.
(కరీంనగర్) సుల్తానాబాద్ : రాఖీ కట్టి స్వగ్రామానికి వెళుతుండగా శనివారం సుల్తానాబాద్ బస్టాండ్‌లో వివాహిత మహిళ మెడలో నుంచి పుస్తెల తాడును గుర్తుతెలియని యువకులు అపహరించారు. వివరాల్లోకి వెళితే.. నల్లవెల్లి సత్తమ్మ అనే మహిళ మండలంలోని రేగడిమద్దికుంట గ్రామంలో ఉన్న సోదరునికి రాఖీ కట్టి తిరిగి ఇంటికి వెళుతుండగా సుల్తానాబాద్ బస్టాండ్‌లో గుర్తు తెలియని యువకులు పుస్తెలతాడును అపహరించారు.
వరంగల్ జిల్లా జనగాంకు చెందిన సత్తమ్మ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతుండగా వెనుక నుంచి రెండున్నర తులాల పుస్తెల తాడును గుర్తుతెలియని యువకులు లాక్కుని పరారయ్యారు. బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించి పోలీసులు పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.