సాక్షి, తిరుమల: తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసి బస్ స్టేషన్ వద్ద పద్మనాభ యాత్రిక సదన్ భవనం నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. వసతి సముదాయం (రెండో అంతస్తు) నుంచి బాలుడు కిందకి పడిపోయాడు. వైఎస్సార్ కడప జిల్లా చినచౌక్‌కు చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతుల కుమారుడు సాత్విక్(3)గా గుర్తించారు.
తిరుమలలో ఇంటి దొంగలు చేతివాటం
తిరుమలలో ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో దళారీలు.. భక్తులకు స్వామివారి దర్శనం చేయిస్తున్నారు. విజిలెన్స్ వింగ్ అధికారులకు అనుమానం రావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద నిలిపివేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతితో అగ్నిమాపక పీఎస్‌జీ మణికంఠ, భానుప్రకాష్ భక్తులను మోసగిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మణికంఠ సహాయంతో నకిలీ టికెట్లను తయారు చేస్తున్నారు. హైదరాబాద్, ప్రొద్దుటూరు, బెంగుళూరు భక్తులు సుమారు 11 మంది నుంచి రూ.19 వేలు వసూలు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment