డీఈ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు | DE office siege farmers | Sakshi
Sakshi News home page

డీఈ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

Mar 30 2014 2:05 AM | Updated on Oct 1 2018 2:00 PM

చివరి భూముల్లో వేసిన ఆరుతడి పంటలకు సైతం నీరందడం లేదంటూ స్థానిక ఎస్సారెస్పీ డీఈ కార్యాలయాన్ని శనివారం రైతులు ముట్టడించారు.

సుల్తానాబాద్, న్యూస్‌లైన్ : చివరి భూముల్లో వేసిన ఆరుతడి పంటలకు సైతం నీరందడం లేదంటూ స్థానిక ఎస్సారెస్పీ డీఈ కార్యాలయాన్ని శనివారం రైతులు ముట్టడించారు. డీ86 కెనాల్ ఆయకట్టు రైతులు ధర్నాకు దిగారు. రైతుల ధర్నా విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులు వచ్చే వరకు కార్యాలయానికి చేరుకోలేదు. పోలీసులు చేరుకున్నాక వచ్చిన డీఈ రాముతో రైతులు వాగ్వాదానికి దిగారు. నీరందక పంటలు ఎండిపోయేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 

చొప్పదండిలో 1050 క్యూసెక్కుల నీరు వదిలి అన్ని డీపీలు మూసివేస్తే చివరి భూములకు నీర ందుతుందన్నారు. ఉప కాలువలు మూసివేయకపోవడంతో హుస్సేమియా, మానేరువాగులోకి నీరు వృథాగా పోతుందన్నారు. 72 గంటల పాటు 1050 క్యూసెక్కుల నీరు వదులుతామని డీఈ హామీతో రైతులు ఆందోళన విరమించారు. ఆందోళనలో రైతులు పడాల కుమారస్వామి, ఎం.లింగయ్య, కె.మల్లారెడ్డి, రఘుపతి, సమ్మారావు, రవీందర్‌రెడ్డి, మాదన్న, రాజు, రమేశ్, సది, శంకర్, కొమురయ్య, మొండయ్య, రాయమల్లు, కుమార్, శ్రీను, రవి, ఓదేలు పాల్గొన్నార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement