సుల్తానాబాద్ (కరీంనగర్) : సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి స్టేజీ వద్ద ఆగి ఉన్న ఆటోను పెద్దపల్లి వైపు వెళ్తున్న ఓ అంబులెన్స్ ఢీకొట్టింది. మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.