వీఆర్ఏలను విస్మరించడం తగదు
కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం అందరి వేతనాలు పెంచి వీఆర్ఏలను విస్మరించడం తగదని కరీంనగర్ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ అన్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వారధిగా పని చేస్తున్న వీఆర్ఏలను సర్కారు గుర్తించకపోవడం బాధాకరమన్నారు. 010 పద్దుతో జీతాలు ఇవ్వడంతో పాటు ప్రమోషన్ల జాబితాను అసెంబ్లీ సమావేశాల్లోపే పూర్తి చేయాలని కోరారు.
(సుల్తానాబాద్)