కల్హేర్ (మెదక్): ఆశా వర్కర్లు ప్రేమతో సమస్యలను ఏకరువు పెడితే వాటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. గురువారం మెదక్ జిల్లా కల్హేర్ మండలంలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు పర్యటించారు. ఈ క్రమంలో కృష్ణాపూర్ వద్ద ఆశా వర్కర్లు మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకోవటంతో.. సమస్యలుంటే నేరుగా విన్నవించాలని మంత్రి సూచించారు. అనవసర రాద్ధాంతం చేస్తే ఉపయోగం ఉండదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.