మంత్రి హరీశ్ రావు దిష్టిబొమ్మ దహనం | ASHA workers takes on harish rao | Sakshi
Sakshi News home page

మంత్రి హరీశ్ రావు దిష్టిబొమ్మ దహనం

Published Sun, Sep 6 2015 12:50 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

ASHA workers takes on harish rao

ఆదిలాబాద్ : భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు దిష్టిబొమ్మకు ఆశా కార్యకర్తలు ఆదివారం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో శవయాత్ర నిర్వహించారు. అనంతరం ఆ దిష్టిబొమ్మను బస్టాండ్ సెంటర్లో దహనం చేశారు. తమ వేతానాలు పెంచాలని ఆశా కార్యకర్తలు శనివారం హరీశ్రావును కలసి విజ్ఞప్తి చేశారు.

వేతనాలు పెంచడం కుదరదని ఆయన వారికి నిక్కచ్చిగా చెప్పారు. దాంతో ఆశా కార్యకర్తలు ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో హరీశ్రావు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి... దహనం చేశారు. అనంతరం  రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement