వరంగల్: గత 24 రోజులుగా తమ డిమాండ్లు తీర్చాలని ఆశావర్కర్లు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. ఆశావర్కర్లు తమ ఆందోళనను ఉధృతం చేశారు. సమ్మెలో భాగంగా బుధవారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడిలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆశావర్కర్లకు మద్యా తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
సమ్మెలో భాగంగా ఈరోజు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆశావర్కర్లకు మద్యా తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కరీంనగర్లో
కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలోని ఆశా వర్కర్లు బుధవారం నాడు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి భారీసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కలెక్టరేట్
గేటు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆశావర్కర్లకు మధ్య స్వల్ప
తోపులాట చేసుకుంది. సుమారు మూడు గంటల పాటు ధర్నా నిర్వహించటంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పలుచోట్ల ఆశా వర్కర్ల ఆందోళనలు
Published Wed, Sep 23 2015 3:31 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM
Advertisement
Advertisement