ఖమ్మంమయూరిసెంటర్: మాత శిశు మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్న తమకు ప్రభుత్వం వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్లు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. అర్హులైన వారిని సెకండ్ ఏఎన్‌ఎంలుగా గుర్తించాలని, కమ్యూనిటీ వర్కర్స్‌కు 27 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని నినాదాలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్న తమ పట్ల.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆశ కార్యకర్తలు ఆరోపించారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఆశ వర్కర్ల సంఘ జిల్లా కార్యదర్శి సీహెచ్.కుమారి, రామారావు, వెల్లబోయిన రాధ, బి.అమల, జ్యోతి, భాగ్యమ్మ, సుభద్ర, సువర్ణ, సాయిబీ, ధనలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నర్సింహరావు, లింగయ్య, మోహన్‌రావు పాల్గొన్నారు.