జెనీవా: భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలందిస్తోన్న ఆశా వర్కర్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలందించడంతో వీరు కీలకంగా ఉన్నారని, కరోనా మహమ్మారి సమయంలో అలుపెరగని విధంగా శ్రమించారని కొనియాడింది.
ఆరోగ్యవంతమైన సమాజం కోసం, స్థానిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ముందుండి నిబద్ధతతో పనిచేసిన ఆరు సంస్థలు, వ్యక్తులకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ పురస్కారాలు ప్రకటించారు. ఈ సంస్థల్లో భారత ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న 10 లక్షల మంది ఆశా(అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్)లు కూడా ఉన్నారు. ఆశా వర్కర్లతో పాటు మరో ఐదింటికి అవార్డులు అందించింది డబ్ల్యూహెచ్‌వో.
ఆశా కార్యకర్తలందరికీ అభినందనలు. ఆరోగ్యవంతమైన భారతదేశానికి భరోసా ఇవ్వడంలో వారు ముందున్నారు. వారి అంకితభావం, సంకల్పం ప్రశంసనీయం అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Delighted that the entire team of ASHA workers have been conferred the @WHO Director-General’s Global Health Leaders’ Award. Congratulations to all ASHA workers. They are at the forefront of ensuring a healthy India. Their dedication and determination is admirable. https://t.co/o8VO283JQL
— Narendra Modi (@narendramodi) May 23, 2022
Comments
Please login to add a commentAdd a comment