మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రధాని మోదీ అద్భుతాలు సృష్టించి అనుకున్నది సాధించారని.. ఆ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారాయన.
మా మిత్ర దేశం ఇండియా.. ఆ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యాకు గొప్ప మిత్రుడు. కొన్నేళ్ల కిందట మేక్ ఇండియా అనే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. సమర్థవంతంగా దానిని ఆయన తన దేశంలో అమలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది అని మాస్కోలో జరిగిన ఓ ఈవెంట్‌లో అధ్యక్షుడు పుతిన్ ప్రసంగించారు.
దేశీయ ఉత్పత్తుల ప్రోత్సాహంతో ఎలాంటి అభివృద్ధి సాధించవచ్చో ప్రధాని మోదీ భారత్‌లో చేసి చూపించారని.. రష్యా దీనిని ఆదర్శంగా తీసుకోవాలని పుతిన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం దారుణంగా పడింది. ఈ నేపథ్యంలో.. స్వదేశీ ఉత్పత్తులపై ఆధారపడడం ద్వారా సంక్షోభం నుంచి బయటపడొచ్చని గత కొంతకాలంగా పుతిన్ రష్యా ప్రజలకు పిలుపు ఇస్తూ వస్తున్నారు.
ఇదీ చదవండి: పెద్దన్నకు మతిమరుపే కాదు.. ఈ సమస్య కూడా ఉంది!
Comments
Please login to add a commentAdd a comment