ఢిల్లీ: ప్రధాని మోదీ నేడు(ఆదివారం) మన్‌కీ బాత్ 104వ ఎపిసోడ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మేఘాలయవాసి బ్రియాన్ డి ఖర్ప్రాన్‌పై ప్రశంసలు కురిపించారు. బ్రియాన్ తన బృందంతో కలిసి మేఘాలయాలో 1700లకు పైగా గుహలను కనుగొన్నారని చెప్పారు. బ్రియన్ చేసిన సేవలను కొనియాడారు. మేఘాలయ గుహలను సందర్శించాలని దేశ ప్రజలను కోరారు.
ఎవరు ఈ బ్రియాన్ డి ఖర్ప్రాన్ ?
మన్ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ బ్రియాన్ గురించి చెప్పారు.'1964లో పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే బ్రియాన్ డి ఖర్ప్రాన్ గుహలను కనుగొనడం ప్రారంభించారు. 1990నాటికి ఆయన తన స్నేహితులతో కలిసి ఓ సంఘాన్ని స్థాపించారు. వారందరూ కలిసి మేఘాలయాలో బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో గుహలను వెలుగులోకి తీసుకువచ్చారు. బ్రియాన్ డి ఖర్ప్రాన్ తన బృందంతో కలిసి 1700పైగా గుహలను కనిపెట్టారు. ప్రపంచ పటంలో మేఘాలయా గుహలకు స్థానం వచ్చింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అత్యంత లోతైన, పొడవైన గుహలు ఉన్నాయి' అని ప్రధాని మోదీ చెప్పారు.
During #MannKiBaat, talked about Mr. Brian D. Kharpran Daly, who has done decades of work on discovering and popularising caves in Meghalaya. I also urge you all to travel to Meghalaya and explore the beautiful caves yourself. pic.twitter.com/pZDX1SOFuu
— Narendra Modi (@narendramodi) August 27, 2023
టూరిస్టులు మేఘాలయా గుహలను తమ ప్రణాళికలో భాగం చేసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. దేశంలోనే చాలా పొడవైన, లోతైన గుహలు మేఘాలయాలో ఉన్నాయని తెలిపారు. అది బ్రియాన్ చేసిన కృషి ఫలితమేనని అన్నారు. మేఘాలయ అడ్వెంచరర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేసిన బ్రియాన్ డి ఖర్ప్రాన్ ఇప్పటివరకు రాష్ట్రంలోని 537.6 కి.మీ గుహలను చుట్టివచ్చారు.
ఇదీ చదవండి: మోదీ మన్‌కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని
Comments
Please login to add a commentAdd a comment