ఆశావర్కర్ల ఆందోళన | asha workers agitation | Sakshi
Sakshi News home page

ఆశావర్కర్ల ఆందోళన

Published Sat, Nov 12 2016 2:03 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

asha workers agitation

ఏలూరు అర్బ¯ŒS  : అపరిష్కృతంగా ఉన్న సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆశా వర్కర్లు శుక్రవారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జిల్లావ్యాప్తంగా డీఎంహెచ్‌వో ఆధీనంలో ఉన్న 79 పీహెచ్‌సీల్లో 2,500 మంది ఆశావర్కర్‌లుగా విధులు నిర్వహిస్తున్నారని,  ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాల జయప్రదానికి 11 ఏళ్లుగా తాము కృషి చేస్తున్నామని కార్యకర్తలు గుర్తుచేశారు. ఇంత చేస్తున్నా.. తమకు నెలనెలా జీతాలు కూడా సరిగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘ నాయకులు డి.మాత, సుకుమారి, విజయకుమారి, చిట్టెమ్మ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement