ఆదిలాబాద్ జిల్లాలో ఆశ కార్యకర్తలు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లాలో ఆశ కార్యకర్తలు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. కనీస వేతనాలు ఇవ్వాలంటూ ధర్నా చేపట్టారు. బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. రూ.10 వేల కనీస వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు నిరవధిక సమ్మెను విరమించబోమన్నారు.