నాగార్జునసాగర్: తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆకలి వేస్తే కేకలు వేసే హక్కులు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వేతనం పెంపు కోసం సమ్మె చేసిన 1200 మంది మున్సిపల్ కార్మికులను తొలగించడం ప్రజాస్వామ్యమా అని ఆయన ప్రశ్నించారు.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో సీపీఎం రాష్ట్ర ప్లీనరీ సభలు మంగళవారం మూడో రోజుకు చేరుకున్నాయి. తమ్మినేనితోపాటు జిల్లా పార్టీ కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గం సభ్యుడు బి.వెంకట్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.
ఆశా కార్యకర్తల సమ్మెకు పూర్తి మద్దతుగా నిలవాలని, కార్యకర్తలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. విరాళాలు ఇవ్వాలని కోరగా, అక్కడున్న వారు రూ.1.02 లక్షలు అందించారు. ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలు సేకరించి ఆశా వర్కర్లకు ఇవ్వాలని తీర్మానించారు. రైతులకు రుణాలన్ని ఒకే దఫాలో మాఫీ చేయాలని, ప్రైవేటు అప్పుల నుంచి ఒత్తిడి తొలగించేందుకు ప్రభుత్వం మారటోరియం ప్రకటించాలన్నారు.
కార్మికులను తొలగించడం ప్రజాస్వామ్యమా
Published Tue, Oct 27 2015 1:34 PM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM
Advertisement