సాక్షి,హైదరాబాద్: ఆశా వర్కర్లపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని,ఈ దాడిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశావర్కర్లను మంగళవారం(డిసెంబర్10)మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,మహమూద్ అలీ,జగదీష్ రెడ్డి,ఇతర బీఆర్‌ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ పరారమర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆశావర్కర్ల మీద జరిగిన దాడిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. అవసరం అయితే జాతీయ మానవహక్కుల కమిషన్‌ను కలుస్తాం. ఆశా వర్కర్లు ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాలని అడిగారు.కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీనే నెరవేర్చాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తూన్నారు.నిరసనలు చేస్తే ఆశా వర్కర్లపై దాడులు చేస్తారా. లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయింది.
ఆశావర్కర్లపై నిన్న జరిగిన దాడి దుశ్శాసన పర్వం. అధికారంలోకి వస్తే ఆశావర్కర్లకు గౌరవ వేతనం ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిని వెంటనే ఇవ్వాలి. ఆశా వర్కర్ల డిమాండ్లపై అసెంబ్లీలో కొట్లాడుతాం.ఉస్మానియాలో సరైన వైద్యం అందకపోతే గాయపడ్డ ఆశా వర్కర్లకు బీఆర్‌ఎస్ పార్టీ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తాం’అని కేటీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment