వేములపల్లి: ఆశా వర్కర్ల సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లాలో బుధవారం పీహెచ్‌సీలకు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వం చిన్నారులకు టీకాలు వేసేందుకు ఏర్పాటు చేసిన మిషన్ ఇంద్ర ధనస్సు(ఏడు టీకాల కార్యక్రమం) నిలిచిపోయింది. తమ డిమాండ్లను తీర్చాలంటూ ధర్నాకు దిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసన చేస్తున్న కార్యకర్తలు మండల కేంద్రంలోని పీహెచ్‌సీతో పాటు పాములపాడు గ్రామంలో ఉన్న పీహెచ్‌సీలకు తాళాలు వేశారు. దీంతో పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం నిలిచిపోయింది.
నిలిచిన మిషన్ ఇంద్రధనస్సు
Published Wed, Oct 7 2015 10:39 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement