
నెరవేరిన ‘ఆశ’లు
⇒ ఆశ వర్కర్ల వేతనాలు రూ.6 వేలకు పెంపు
⇒ ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని క్షేత్ర స్థాయి సిబ్బందిగా పనిచేస్తున్న ఆశ వర్కర్ల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆశ వర్కర్లకు నెలకు రూ.6 వేల చొప్పున వేతనాలు చెల్లించాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. 2017 మే 5 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం అమ లు చేసే జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హె చ్‌ఎం), రాష్ట్ర ప్రభుత్వ నిధులను కలిపి పెంచిన వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమి షనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాది జూన్‌లో ఆశ వర్కర్ల జీతం పెంచుతామని ముఖ్య మంత్రి కేసీఆర్ చెప్పారు. సీఎం హామీ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆశ వర్కర్లకు వేతనాల పెంపుపై ప్రతిపాదనలు రూపొందిం చి ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రంలో దాదాపు 27,845 మంది ఆశ వర్కర్లు పని చేస్తున్నారు.
ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమంలో భాగంగా వీరు నియమితులయ్యారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో అమ లయ్యే అన్ని పథకాలు, కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ఆశ కార్యకర్తలే ప్రజల వద్దకు తీసు కెళ్తున్నారు. దాదాపు 28 రకాల వైద్య సేవల్లో ఆశ కార్యకర్తలు కీలకంగా వ్యవహరిస్తున్నారు.