జీహెచ్‌ఎంసీ కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ఇచ్చారు.
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ఇచ్చారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కార్మికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్‌లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి కార్మికులు పాలాభిషేకం చేశారు.
అనంతరం మహిళా కార్మికులు బతుకమ్మ ఆడారు. జీతాలు పెంచిన సీఎంకు రుణపడి ఉంటామని కార్మికులు చెప్పారు.