2024 ప్రారంభమైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవా సంస్థ 'ఎయాన్' (Aon) సర్వే మాత్రం ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ ఓ శుభవార్త చెప్పింది.
ఈ ఏడాది భారతీయ ఉద్యోగుల సగటు జీతం 9.5 శాతం పెరిగే అవకాశం ఉందని సర్వే ద్వారా ఎయాన్ వెల్లడించింది. ఇది 2023 కంపెనీలు అందించిన జీతాల పెంపు కంటే (2023 జీతాల పెంపు 9.7 శాతం) కొంత తక్కువగా ఉందని స్పష్టం చేసింది.
ఈ సర్వే కోసం ఎయాన్ సుమారు 45 రంగాలకు చెందిన 1414 కంపెనీల డేటా విశ్లేషించింది. ఇందులో తయారీ రంగం 10.1 శాతం జీతాల పెంపుతో ముందు వరుసలో ఉన్నట్లు, ఆర్థిక సంస్థలు, లైఫ్ సైన్సెస్ రంగాలు 9.9 శాతం జీతాల పెంపుతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు అంచనా వేసింది.
ఈ కామర్స్ సంస్థలు సగటున 9.2 శాతం పెంపును ఇచ్చే అవకాశం ఉంది. ఇక FMCG, కన్స్యూమర్ డ్యూరబుల్ ప్లేయర్స్ జీతాలను 9.6 శాతం, రిటైల్ రంగంలో 8.4 శాతం పెంచే అవకాశం ఉందని సమాచారం. ప్రొఫెషనల్ సర్వీసెస్ అండ్ కెమికల్స్ రంగాల జీతాల పెంపు 9.7 శాతంగా అంచనా. టెక్నాలజీ ప్లాట్‌ఫామ్, ఉత్పత్తుల రంగం జీతాలను 9.5 శాతం పెంచే అవకాశం ఉంది. ఈ సమయంలో టెక్ కన్సల్టింగ్ విభాగంలో ఉద్యోగుల వేతనాలు 8.2 శాతం మాత్రమే పెరిగే అవకాశం ఉంది.
భారతదేశంలో మొత్తం అట్రిషన్ రేట్లు 2022లో 21.4 శాతం నుంచి 2023లో 18.7 శాతానికి పడిపోయినట్లు సర్వేలో తెలిసింది. 2023లో కొన్ని సంస్థలు కొంత అనిశ్చితి వాతావరణం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్ర్రాభం నుంచి కంపెనీల పురోగతి కొత్త కొత్త వ్యూహాలను రచిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల జీతాలు గత ఏడాది కంటే మెరుగ్గా ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: నేనింకా అప్డేట్ కాలేదేమో! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..
జీతాల పెంపు విషయంలో భారత్ అగ్రగామిగా నిలువగా.. బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది బంగ్లాదేశ్, ఇండోనేషియా దేశాల్లో జీతాలు పెంపు 7.3 శాతం, 6.5 శాతంగా ఉండనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment