సమ్మెను పరిష్కరించాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: వేతనాల పెంపు కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ చొరవ చూపాలని వామపక్ష పార్టీలు కోరాయి. సమస్య పరిష్కారం కాకపోతే ఈనెల 28 నుంచి 30 వరకు అన్ని మండల కేంద్రాల్లో రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం చాడ వెంకటరెడ్డి(సీపీఐ), వెంకటరాములు(సీపీఐ-ఎంఎల్), మురహరి (ఎస్‌యూసీఐ), గౌస్ (ఎంసీపీఐ), జానకి రాములు(ఆర్‌ఎస్‌పీ), కె. నరేందర్ (ఫార్వర్డ్ బ్లాక్),
యార్లగడ్డ సాయిబాబు(రైతు సంఘం) తదితరులతో కలసి తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. న్యాయమై న వేతనపెంపు డిమాండ్‌తో సమ్మె చేస్తున్న మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం దొరతనంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. సమ్మె విరమిస్తే వేతనాలు పెంచుతామని చెప్పడం ప్రజాస్వామ్యం కాదన్నారు.