ఫ్రెషర్‌లకు అతి తక్కువ జీతాల ప్యాకేజీలను అందించినందుకు విమర్శలు ఎదుర్కొంటున్న ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ వేతనాల పెంపులోనూ అలాంటి ధోరణినే అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఉద్యోగులకు వార్షిక జీతాల పెంపును అత్యల్పంగా కేవలం 1% మాత్రమే అందించినట్లు నివేదికలు వెల్లడించాయి.
ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ నాలుగు నెలల ఆలస్యంగా జీతాల పెంపును ప్రారంభించింది. జీతాల పెంపు 1% నుంచి 5% వరకు ఉంటుంది. "3 రేటింగ్ ఉన్నవారు 1-3%, 4 రేటింగ్ ఉన్న ఉద్యోగులు 4%, 5 రేటింగ్ పొందిన వారు 4.5% నుంచి 5% వేతన పెంపు అందుకున్నారు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ అమెరికన్ ఐటీ కంపెనీ గత సంవత్సరం ఏప్రిల్‌లో ఉద్యోగులకు 7 శాతం నుంచి 11 శాతం వరకు వేతనాలు పెంచింది. భారత్‌లో ఈ కంపెనీకి సుమారుగా 254,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది దాని మొత్తం శ్రామికశక్తిలో 70 శాతం. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 8,100 క్షీణించింది. దీనితో ఉద్యోగుల సంఖ్య 336,300కి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment