
ఉద్యోగులు, నిరుద్యోగులకు కేసీఆర్ వరాల జల్లు
హైదరాబాద్ : నూతన సంవత్సరంతో పాటు త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యోగులు, నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే అతి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. డీఎస్సీ మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్...అధికారులను ఆదేశించారు.