ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దేశంలో సగటున ఉద్యోగుల జీతాలు 10.2 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ- కామర్స్, ప్రొఫెషనల్ సర్వీస్, ఐటీ విభాగాల్లో ఈ వేతనాల పెంపు ఉండనున్నట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది.
‘ఫ్యూచర్ ఆఫ్ పే 2023’ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది జీతాలు 10.2 శాతం పెరగనున్నట్లు తెలిపింది. గత ఏడాది పెరిగిన సగటు ఉద్యోగుల శాలరీలు 10.4 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 2022లో కంటే.. 2023లో జీత భత్యాలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బ్లూ కాలర్ ఉద్యోగాలైన మైనింగ్, ఎలక్ట్రసిటీ జనరేషన్, పవర్ పాంట్ల్ ఆపరేషన్స్, ఆయిల్ ఫీల్డ్ వర్క్, రీసైక్లింగ్, డ్రైవింగ్ వంటి ఉద్యోగుల జీతాలు తగ్గే అవకాశం ఉన్నట్లు నివేదించింది.
జీతాలు పెరిగే రంగాలు ఇవే
దేశంలో మొత్తం మూడు రంగాల్లో ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం ఎక్కువ ఉన్నట్లు ఫ్యూచర్ ఆఫ్ పే 2023 రిపోర్ట్ హైలెట్ చేసింది. వాటిలో ఈ-కామర్స్ విభాగంలో 12.5శాతం, ప్రొఫెషనల్ సర్వీసులైన అకౌంటెంట్స్, డాక్టర్స్, న్యాయవాదులుగా పనిచేసే వారికి 11.9శాతం పెరగ్గా.. ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల జీతాలు 10.8 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment