కోవిడ్ -19, లేఆఫ్స్ వంటి కఠిన సమయాల్లో మీకొక జాబ్ ఆఫర్ వస్తే ? ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 కంపెనీలు మిమ్మల్ని ఆహ్వానిస్తే. అందులో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లాంటి సంస్థలుంటే! ఏం చేస్తారు? ఏం కంపెనీలో చేరాలో నిర్ణయించుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతారు. కానీ బెంగళూరుకు చెందిన ఈ టెక్కీ వచ్చిన ఆఫర్స్ అన్నింటిని తిరస్కరించింది. ఎందుకో తెలుసా?
ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరుకు చెందిన రితి కుమారి (21). ఇప్పటి వరకు 13 కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. జీతం కూడా ఏడాదికి రూ.17లక్షలు పైమాటే.
ఇంత శాలరీ వస్తుంటే ఎవరు కాదంటారు? చెప్పండి. కానీ రితి మాత్రం వద్దనుకుంది. తన మనసుకు నచ్చిన జాబ్ చేయాలని భావించింది. బదులుగా వాల్‌మార్ట్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు మొగ్గుచూపానంటూ జీవితంలో ఎల్లప్పుడూ కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటూ తనకు ఎదురైన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నారు. అన్నట్లు ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన ఆమె ఏడాదికి రూ. 20 లక్షల వేతనం తీసుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు వచ్చిన జాబ్ ఆఫర్‌లు మంచివే. అందులో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. కానీ సోదరి ప్రేరణతో అన్నీ ఉద్యోగాల్ని కాదనుకున్నాను. మనసు మాట విని చివరికి వాల్‌మార్ట్‌ని ఎంచుకున్నారు. 6 నెలల ఇంటర్న్‌షిప్‌లో నెలకు స్టైఫండ్ రూ.85,000 సంపాదించారు.
‘నేను వాల్‌మార్ట్ ఇంటర్న్‌షిప్ ఆఫర్‌ను స్వీకరించినందుకు సంతోషంగా ఉన్నాను. నాకొచ్చిన జాబ్ ఆఫర్స్‌లో పొందే నెలవారీ వేతనం కంటే వాల్ మార్ట్ ఇచ్చే జీతం చాలా తక్కువ .ఈ విషయంలో నా తల్లిదండ్రులు సంతోషంగా లేరు. కఠినమైన సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం గాక ఆందోళన చెందా. ఎవరూ ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. అప్పుడే నా సోదరి ప్రీతి కుమారి ఓ మాట చెప్పింది. ముందు నువ్వు నీ మనసు మాట విను. అది ఏం చెబితే అదే చేయి అంటూ ప్రోత్సహించింది.
ప్రస్తుతం, ధన్‌బాద్‌లోని ఐఐటీలో పీహెచ్‌డీ చదువుతున్న నా సోదరి ప్రీతి కుమారి తల్లిదండ్రుల నిర్ణయాన్ని వ్యతిరేకించి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)లో పాల్గొనేందుకు వచ్చిన జాబ్ ఆఫర్స్‌ను తిరస్కరించారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం సరైందేనని నిరూపించారు.
కాబట్టే, నేను వాల్‌మార్ట్‌లో ఇంటర్న్‌షిప్ ఆఫర్ తీసుకున్నాను.కష్టపడి నా ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. చివరికి వాల్‌మార్ట్ నుండి జాబ్ ఆఫర్ పొందాను అని కుమారి చెప్పారు. ఇప్పుడు తన కెరీర్ విషయంలో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయంపై స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న తన తండ్రిని సహచర ఉపాధ్యాయులు సైతం అభినందించడం సంతోషంగా ఉందని అన్నారు.
రితి లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. జనవరి 2022 నుండి జూలై 2022 వరకు వాల్‌మార్ట్‌లో ట్రైనింగ్ తీసుకుంది. ఆపై వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్ ఇండియా (బెంగళూరు)లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ -2గా చేరింది.
చదవండి👉 యాపిల్ కీలక నిర్ణయం.. చైనా గొంతులో పచ్చి వెలక్కాయ?!
Comments
Please login to add a commentAdd a comment