Stock Price Most Important Lever To Get Pay Raise, Microsoft CMO Chris Capossela Tells Employees - Sakshi
Sakshi News home page

Microsoft: మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు ఊరట.. జీతం పెరగకపోయినా ఆదాయం పెంచుకోవచ్చు! చిట్కా చెప్పిన కంపెనీ సీఎంఓ

Published Sun, May 21 2023 6:44 PM | Last Updated on Mon, May 22 2023 10:53 AM

microsoft cmo proposes stock price boost as alternative to salary hike for employees - Sakshi

వేతన పెంపు విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ఉద్యోగులకు ఊరటనిచ్చే విషయం చెప్పారు ఆ కంపెనీ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌. జీతం పెరగకపోయినా ఆదాయం పెంచుకునే చిట్కా చెప్పారు.

ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలను పెంచడం లేదని మైక్రోసాఫ్ట్‌ ఇటీవల ప్రకటించింది. సీఈవో సత్య నాదెళ్ల స్వయంగా ఉద్యోగులకు సమాచారం అందించారు. దీనిపై కంపెనీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని కంపెనీ సీఎంఓ సూచించారు.

ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ క్రిస్ కాపోస్సేలా ఇటీవల సందేశాలు పంపినట్లు ఫార్చూన్‌ పత్రిక పేర్కొంది. కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఎందుకు పెంచలేదో ఆ లేఖలో ఆయన వివరించారు. అలాగే ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని సూచించారు. కంపెనీ స్టాక్‌ ధర పెరిగితే.. ఉద్యోగులకు అందే పరిహారం కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుందని, ప్రతిఒక్కరూ స్టాక్‌ ధర పెరిగేలా పనిచేయాలని సూచించారు.

ఈ ఏడాది కంపెనీ షేరు విలువ ఇప్పటికే 33 శాతం పెరిగినట్లు ఆయన గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కంపెనీని అనుకూలంగా ఉంచే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు, మానవ వనురుల పెంపు, డేటా సెంటర్ సామర్థ్యాన్ని విస్తరించడానికి కట్టుబడి ఉందని క్రిస్ కాపోస్సేలా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement