stock price
-
Adani-Hindenburg case: ‘అదానీ’కి భారీ ఊరట
న్యూఢిల్లీ: ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘అదానీ గ్రూప్’నకు మరో విజయం లభించింది. స్టాక్ ధరల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థపై కొనసాగుతున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లేదా సీబీఐకి అప్పగించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. అదానీ గ్రూప్‌పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) కొనసాగిస్తున్న దర్యాప్తు పట్ల న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. సెబీ సమగ్ర దర్యాప్తు జరుపుతోందని వెల్లడించింది. ఈ దశలో సెబీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దర్యాప్తును సెబీ నుంచి సిట్ లేదా సీబీఐకి బదిలీ చేయాలన్న వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 46 పేజీల తీర్పు వెలువరించింది. అదానీ గ్రూప్‌పై పెండింగ్‌లో ఉన్న రెండు దర్యాప్తులను 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. సెబీ దర్యాప్తును అనుమానించలేం అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని, మదుపర్లను మోసగించిందని ఆరోపిస్తూ అదానీ–హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ వివాదం తర్వాత సుప్రీంకోర్టులో నాలుగు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. న్యాయవాదులు విశాల్ తివారీ, ఎంఎల్ శర్మ, కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, అనామికా జైశ్వాల్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ నివేదిక వచి్చన తర్వాత ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సెబీ చట్టంలో చేసిన మార్పుల కారణంగా అదానీ గ్రూప్ అవకతవకలు బయటపడడం లేదని పిటిషనర్లు ఆరోపించారు. సెబీని పటిష్టం చేయాలని కోరారు. ఈ నాలుగు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పత్రికల్లో వచి్చన వార్తలు లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు(ఓసీసీఆర్పీ) వంటి థర్డ్ పార్టీ సంస్థల నివేదికల ఆధారంగా సెబీ దర్యాప్తును అనుమానించలేమని స్పష్టం చేసింది. అలాంటి నివేదికలను కేవలం ఇన్‌పుట్స్‌గా పరిగణించవచ్చని అభిప్రాయపడింది. సెబీ దర్యాప్తును అనుమానించడానికి అలాంటివి ఆధారాలుగా ఉపయోగపడవని పేర్కొంది. చట్టబద్ధమైన సంస్థ అయిన సెబీ కొనసాగిస్తున్న దర్యాప్తును మరో సంస్థకు బదిలీ చేసే అధికారం కోర్టుకు లేదని పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల్లోనే మాత్రమే అలా బదిలీ చేయగలమని తేలి్చచెప్పింది. నిర్ధారణ కాని సమాచారంపై ఆధారపడొద్దు అదానీపై గ్రూప్‌పై 24 ఆరోపణలు రాగా, సెబీ ఇప్పటికే 22 ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చేయడానికి, కోర్టుకెక్కడానికి నిర్ధారణ కాని సమాచారంపై పిటిషనర్లు ఆధారపడినట్లు తెలుస్తోందని వెల్లడించింది. వారు తగిన పరిశోధన కూడా చేయకుండానే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని ఆక్షేపించింది. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకూడదని సూచించింది. న్యాయవాదులు గానీ, పౌర సమాజం సభ్యులు గానీ అప్రమత్తంగా ఉండాలని, నిర్ధారణ కాని సమాచారం లేదా థర్డ్‌పార్టీ నివేదికల ఆధారంగా ఇష్టారాజ్యంగా పిటిషన్లు వేయడం సరైంది కాదని తేలి్చచెప్పింది. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సానుకూల సంకేతాలు రావడంతో బుధవారం స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్‌లోని నమోదిత కంపెనీల షేర్ల ధరలు పైకి ఎగబాకాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఎన్డీటీవీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ వంటి సంస్థల షేర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. సత్యమేవ జయతే: గౌతమ్ అదానీ సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు. సత్యమే జయిస్తుందన్న నిజాన్ని ఈ తీర్పు మరోసారి నిరూపించిందని అన్నారు. భారతదేశ ప్రగతి చరిత్రలో తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉంటామని చెప్పారు. ప్రతికూల సమయంలో తమకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘సత్యమేవ జయతే’ అంటూ గౌతమ్ అదానీ బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
విడాకుల వివాదం.. లాయర్‌ను నియమించారు.. కానీ..
రేమండ్ కంపెనీ ప్రమోటర్‌గా ఉన్న సింఘానియా కుటుంబంలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీ ఎండీగా ఉన్న గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్‌మోదీతో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే అందుకు కంపెనీలో 75 శాతం వాటా(రూ.8 వేల కోట్లు)ను ఆమె డిమాండ్ చేశారు. దానిపై తాను కోర్టును ఆశ్రయించేందుకు న్యాయసలహాదారులను కూడా నియమించుకున్నారని వార్తలు వచ్చాయి. గౌతమ్ సింఘానియా మాత్రం ఆయన మరణం తర్వాత తన ఆస్తిని ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి దానికి చేరేలా చూడాలని కోరినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంతో కంపెనీ డైరెక్టర్లలో స్పష్టత లోపిస్తున్నట్లు తెలిసింది. కంపెనీ బిజినెస్ మోడల్‌పై ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపబోతుందోనని ఆందోళనలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇటీవల ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్(ఇయాస్) రేమండ్ కంపెనీని దాని ప్రమోటర్ల నుంచి రక్షించాలని స్వతంత్ర డైరెక్టర్లను కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ బోర్డు చర్యలు ప్రారంభించింది. రేమండ్ బోర్డులోని ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్-నవాజ్ వైవాహిక వివాదాల మధ్య కంపెనీకి సలహా ఇవ్వడానికి స్వతంత్ర సీనియర్ న్యాయవాదిని నియమించారు. జరుగుతున్న పరిణామాలపై తాము అప్రమత్తగా ఉన్నామని, తగిన చర్యలు తీసుకుంటామని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న వైవాహిక వివాదాల నేపథ్యంలో కంపెనీ వ్యవహారాలు ప్రభావితం చెందకుండా ఉండేలా ఇండిపెండెండ్ డైరెక్టర్లు అప్రమత్తంగా ఉంటారని ఫైలింగ్‌లో చెప్పారు. ఈ విషయంలో సలహా కోసం ప్రమోటర్లతో లేదా కంపెనీతో ఎలాంటి సంబంధం లేని సీనియర్ న్యాయవాది బెర్జిస్ దేశాయ్‌ని నియమించాలని నిర్ణయించారు. కంపెనీ వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి అవసరమైన చర్యలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదీ చదవండి: వాట్సాప్ న్యూ సీక్రెట్ ఫీచర్.. ఎలా సెట్ చేయాలంటే? జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రేమండ్ నికర లాభం స్వల్పంగా పెరిగి రూ.159.78 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4 శాతం పెరిగి రూ.2,168.2 కోట్ల నుంచి రూ.2,168.2 కోట్లకు చేరుకుంది. పండగలు, వివాహాల సీజన్ ప్రారంభం కావడంతో వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగిందని ఫలితాల సమయంలో సింఘానియా ప్రకటించారు. -
రైల్వే సంస్థ జాక్‌పాట్! రికార్డ్ స్థాయిలో పెరిగిన షేర్ల ధర
భారతీయ రైల్వే ఆధీనంలోని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) జాక్‌పాట్ కొట్టింది. స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్లు గురువారం (ఆగస్ట్ 3) నాడు 12 శాతం పెరిగి 52 వారాల కొత్త గరిష్ట స్థాయి రూ.44.65కి చేరుకున్నాయి. ఐఆర్ఎఫ్సీ షేర్ల ధర భారీగా పెరగడానికి కారణం వెంటనే స్పష్టంగా తెలియనప్పటికీ, రూ.5.25 లక్షల కోట్ల పెట్టుబడికి రైల్వే శాఖ ప్లాన్ చేసిందని, దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదానికి ప్రయత్నిస్తున్నట్లు వారం రోజుల కిందట కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. 2024 నుంచి 2031 ఆర్థిక సంవత్సరాల కాలంలో దేశంలోని రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ పెట్టుబడి ఉద్దేశించినట్లు తెలుస్తోంది. ఇన్‌క్రెడ్ ఈక్విటిస్ గౌరవ్ బిస్సా ఈ స్టాక్‌పై రూ.45 ధర లక్ష్యంతో కొనుగోలు కాల్ జారీ చేయడంతో స్టాక్ కూడా ఊపందుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. క్యాపిటల్ మార్కెట్లు, ఇతర రుణాల ద్వారా ఆర్థిక వనరులను సేకరిస్తుంది. దీనిపై రైల్వే శాఖ పరిపాలనా నియంత్రణను కలిగి ఉంది. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉంది. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఊరట..
వేతన పెంపు విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న మైక్రోసాఫ్ట్ (Microsoft) ఉద్యోగులకు ఊరటనిచ్చే విషయం చెప్పారు ఆ కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. జీతం పెరగకపోయినా ఆదాయం పెంచుకునే చిట్కా చెప్పారు. ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలను పెంచడం లేదని మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రకటించింది. సీఈవో సత్య నాదెళ్ల స్వయంగా ఉద్యోగులకు సమాచారం అందించారు. దీనిపై కంపెనీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని కంపెనీ సీఎంఓ సూచించారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ క్రిస్ కాపోస్సేలా ఇటీవల సందేశాలు పంపినట్లు ఫార్చూన్ పత్రిక పేర్కొంది. కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఎందుకు పెంచలేదో ఆ లేఖలో ఆయన వివరించారు. అలాగే ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని సూచించారు. కంపెనీ స్టాక్ ధర పెరిగితే.. ఉద్యోగులకు అందే పరిహారం కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుందని, ప్రతిఒక్కరూ స్టాక్ ధర పెరిగేలా పనిచేయాలని సూచించారు. ఈ ఏడాది కంపెనీ షేరు విలువ ఇప్పటికే 33 శాతం పెరిగినట్లు ఆయన గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కంపెనీని అనుకూలంగా ఉంచే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు, మానవ వనురుల పెంపు, డేటా సెంటర్ సామర్థ్యాన్ని విస్తరించడానికి కట్టుబడి ఉందని క్రిస్ కాపోస్సేలా పేర్కొన్నారు. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల -
షేర్ల ధర అవకతవకలకు పాల్పడే కంపెనీలపై సెబీ చర్యలు
న్యూఢిల్లీ: షేర్ల ధరల్లో అవకతవకలకు పాల్పడే కంపెనీలు, సంబంధిత డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ యోచిస్తోంది. పన్నులు తప్పించుకోవడానికి సెక్యూరిటీల చట్టాన్ని వేలాది కంపెనీలు ఉల్లంఘించాయని సెబీ భావిస్తోంది. అందుకనే షేర్ల ధరల విషయమై అవకతవకలకు పాల్పడే లిస్టెడ్ కంపెనీలు, సంబంధిత డైరెక్టర్లపై తగిన చర్యలు తీసుకునే ప్రయత్నాలను సెబీ చేస్తోంది. ఇలాంటి లావాదేవీల ద్వారా లబ్ది పొందిన వారి వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి సెబీ అందించనున్నది. ఈ అంశాలకు సంబంధించిన ఒక ప్రతిపాదన ఈ వారంలో సెబీ బోర్డ్ ముందుకు రానున్నది. ఆదాయపు పన్ను విభాగం నివేదించిన వివిధ షేర్ల లావాదేవీలపై సెబీ జరిపిన విశ్లేషణ ఆధారంగా సెబీ ఈ ప్రతిపాదనను రూపొందించిందని సమాచారం.వివిధ కేటగిరీల్లో 32వేలకు పైగా కంపెనీలపై తదుపరి విచారణ జరపాలని సెబీ నిర్ణయించిందని ఈ వర్గాలు వెల్లడించాయి. అక్రమంగా లాభాలు ఆర్జించడానికి లిస్టెడ్ కంపెనీలు, ఆపరేటర్లు, సంబంధిత సంస్థలు పలు స్కీమ్‌లను రూపొందించాయని ఐటీ విభాగం సెబీ దృష్టికి తెచ్చింది. దీర్ఘకాల మూలధన లాభాలు(ఎల్టీజీఎస్), స్వల్పకాలిక మూలధన నష్టాలు చూపడానికి షేర్ల ధరల్లో అవకతవకలకు పాల్పడడం ద్వారా స్టాక్ ఎక్సే్చంజ్ ప్లాట్ఫార్మ్ను దుర్వినియోగం చేశారని ఐటీ విభాగం సెబీకి తెలిపింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేర్ల జారీ, లేదా విలీన ప్రక్రియల ద్వారా అక్రమంగా మూలధన లాభాల పన్ను ప్రయోజనాలు పొందారని ఐటీ విభాగం వివరించింది.