అమలాపురం :ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల వంటి కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలు, అవగాహన సదస్సుల నిర్వహణలో తమకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. గౌరవవేతనాల విషయంలో చిన్నచూపు చూస్తోందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. గౌరవ వేతనం పేరుతో అగౌరవ పరుస్తున్నారని, ఆ మొత్తాన్ని పెంచాలని కొన్ని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని నిరసిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాలు పెంచాలే డిమాండ్ బలంగా ఉంది. విభజనకు ముందు మూడేళ్లపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు లేకపోవడంతో ఈ విషయం తాత్కాలికంగా మరుగునపడింది.
అయితే గత ఏడాది సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగారుు. రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత స్థానిక సంస్థలు కొలువుదీరాయి. అప్పటి నుంచి గౌరవ వేతనం పెంచాలన్న డిమాండ్ తిరిగి ఊపందుకుంది. ఇప్పుడిస్తున్న వేతనాలు చెప్పుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందని, గౌరవ వేతాలు పెంచాలని స్థానిక ప్రతినిధులు పట్టుబడుతున్నారు. లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటున్న శాసనసభ్యులు తమ జీతాల పెంపువిషయాన్ని పట్టించుకోవడం లేదని స్థానిక ప్రతినిధులు బహిరంగంగానే విమర్శించేవారు. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనాలు భారీగా పెంచింది. దీనితో మన రాష్ట్రంలో కూడా గౌరవ వేతనాలు పెంచాలనే డిమాండ్ మరింత ఊపందుకోనుంది.
43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారుగా..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందంటూనే ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులకు పదో వేతన సవరణ సంఘంసిఫార్సు కన్నా ఎక్కువగా ఫిట్‌మెంట్ ఇచ్చింది. తొలుత తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వగా, ఏపీ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని భారీగా పెంచినందున తమకు ఆ స్థాయిలో గౌరవ వేతనం పెంచాలని ఏపీ స్థానిక సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.
మన రాష్ట్రంలో.. తెలంగాణ లో
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గౌరవ
వేతనాలు ఇలా (రూపాయల్లో...)
హోదా రాష్ట్రంలో తెలంగాణ లో (పెంపు తరువాత)
జెడ్పీ చైర్మన్ 7,500 లక్ష
జెడ్సీటీసీ సభ్యుడు 2,250 10,000
ఎంపీపీ 1,500 10,000
ఎంపీటీసీ సభ్యుడు 750 5,000
గ్రామ సర్పంచ్ 1,500 5,000
కార్పొరేషన్ పరిధిలో...
మేయర్ 14,000 50,000
డిప్యూటీ మేయర్ 8,000 25,000
కార్పొరేటర్ 4,000 6,000
స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీల్లో...
మున్సిపల్ చైర్మన్ 10,000 15,000
వైస్ చైర్మన్ 5,000 7,500
కౌన్సిలర్ 2,200 3,500
ఇతర మున్సిపాలిటీల్లో...
చైర్మన్ 8,000 12,000
వైస్ చైర్మన్ 3,200 5,000
కౌన్సిలర్ 1,800 2,500
ఈ వేతనాలు ‘గౌరవ’ప్రదమేనా?
Published Sun, Mar 15 2015 2:25 AM | Last Updated on Tue, Sep 18 2018 7:56 PM
Advertisement
Advertisement