ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్‌ ఎస్‌? | TCS to offer up to 8% hike to employees in India, 2-4% to international workers - Sakshi
Sakshi News home page

ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్‌ ఎస్‌?

Published Wed, Mar 20 2024 9:51 AM | Last Updated on Wed, Mar 20 2024 12:30 PM

TCS Will Implement Salary Hikes For Its Offsite And Onsite Employees - Sakshi

టెక్‌ కంపెనీలు కాస్ట్‌కటింగ్‌ పేరిట ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటిస్తున్నా..నిబంధనల ప్రకారం ఉన్నవారికి మాత్రం వేతనాలు పెంచేపనిలో పడ్డాయి. మార్చితో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు వేతనపెంపునకు సంబంధించి నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల వేతనాలు పెంచనున్నట్లు తెలిసింది.

టీసీఎస్‌ తన ఆఫ్‌సైట్‌ ఉద్యోగులకు సగటున 7 నుంచి 8 శాతం.. ఆన్‌సైట్‌ ఉద్యోగులకు 2-4 శాతం పెంచే యోచనలో ఉందని మీడియా కథనాల ద్వారా తెలిసింది. నైపుణ్యాలను మెరుగుపరుచుకొని పనితీరు కనబరిచిన వారికి ఏకంగా 12-15 శాతం వరకు జీతం పెంచనున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: ప్రాజెక్టుల ఏర్పాటుకు లంచం.. స్పందించిన అదానీ గ్రూప్‌

త్వరలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో టీసీఎస్‌ ఉద్యోగుల వేతన పెంపు ప్రక్రియ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి వేతన పెంపు అమల్లోకి వస్తుందని సమాచారం. ఇదిలా ఉండగా, భారీ వేతనాలు తీసుకుంటున్న వారి ఖర్చులు, పదోన్నతుల అంశాన్ని ఇంకా కంపెనీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నైపుణ్యాలను మెరుగుపర్చుకున్న ఉద్యోగులకు గతేడాదే టీసీఎస్‌ 12-15 శాతం వరకు సగటు ఇంక్రిమెంట్‌ను ఇచ్చింది. దాంతోపాటు ప్రమోషన్లను అందించింది. మరోవైపు ఉద్యోగుల సంఖ్యను మాత్రం తగ్గించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement