కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే వేతన పెంపును అందిస్తోంది. 18 నెలల్లో ఇది మూడవ వేతన పెంపు. పెరుగుతున్న అట్రిషన్ కంపెనీకి తలనొప్పిగా మారింది. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా కంపెనీ షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే వేతన పెంపు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అట్రిషన్ 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది.
(apple saket: యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది!)
వేతన పెంపునకు సంబంధించిన లెటర్లను ఉద్యోగులు ఈ వారంలో అందుకుంటారని కంపెనీ వారికి పంపిన ఈ-మెయిల్స్‌లో పేర్కొంది. సంవత్సరాంతపు పనితీరు సమీక్షలను అనుసరించి ఆరు నెలల ముందుగానే ఈ మెరిట్ పెంపును అందిస్తున్నామని, 18 నెలల్లో ఇది మూడో మెరిట్ పెరుగుదల అని కంపెనీ సీఈవో రవికుమార్ వివరించారు. జనవరిలో డైరెక్టర్లు అంతకంటే పైస్థాయివారికి ఇచ్చిన పెంపుతో కలిపి 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు వేతన పెంపును అందుకుంటున్నారని తెలిపారు. అలాగే ఉద్యోగులకు నిరంతర శిక్షణ, నైపుణ్యం, వృత్తిపరమైన అభివృద్ధిలో కంపెనీ ఎప్పుడూ తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు.
కాగా షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే అమలు చేస్తున్న ఈ వేతన పెంపు కంపెనీ వన్-టైమ్ టూ-మెరిట్ సైకిల్ పెంపులో భాగం. ఈ వేతన పెంపును గత సంవత్సరమే ప్రకటించారు. 2022 అక్టోబర్‌లో, ఆపై 2023 ఏప్రిల్‌లో వేతన పెంపుదల ఉంటుందని కంపెనీ గతంలోనే పేర్కొంది.
ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్..
Comments
Please login to add a commentAdd a comment