
ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాయపూర్: మావోయిస్టులపై పోరు సల్పుతున్న భద్రతా దళాలను ప్రోత్సహించేందుకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు జవానులు, కానిస్టేబుల్స్, అసిస్టెంట్ కానిస్టేబుల్స్ జీతాలు 58 శాతం పెంచింది. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 22 వేల మంది పోలీసులకు జీతాలు భారీగా పెరగనున్నాయి.
పెంచిన దాని ప్రకారం చూస్తే ఇంతకుముందు నెలకు రూ. 8,990 జీతం అందుకునే వారికి ఇప్పుడు రూ. 14,144 వస్తుంది. అంతేకాదు పోలీసులకు రూ. 25 లక్షల చొప్పున బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.121 కోట్ల భారం పడనుంది. రాష్ట్రానికి పెద్ద సమస్యగా పరిణమించిన నక్సల్స్ తో పోరాడుతున్న పోలీసులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు జీతాలు పెంచినట్టు సీఎం రమణ సింగ్ తెలిపారు.