వాళ్లకు 5,300 పెంచారు.. మాకు 2,500లేనా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై ఆ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు కేవలం రూ. 2,500 మాత్రమే జీతం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 2,500 జీతం పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పెంపు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉద్యోగులు.. పీఆర్సీ ప్రకారం తమకు వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఇటీవల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 5,300 జీతం పెంచారని, అదే సమయంలో ఏపీ ప్రభుత్వం తమకు రూ. 2,500 మాత్రం జీతం పెంచితే ఎలా బతికేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన దేనికీ సరిపోదని, నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలంటుతున్న నేపథ్యంలో ఇంతతక్కువమొత్తంలో జీతాన్ని పెంచడం ఏమాత్రం సమంజసం కాదని వారు అంటున్నారు.